
పునర్జన్మనిచ్చిన వైద్యులు..
జుట్టు, గడ్డి తెగ తినేశాడు..కట్ చేస్తే..
చిన్న పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకోవడం, ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టుకోవడం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. మరికొంతమంది మట్టి తినడం, సుద్దముక్కలు తినడం,మరికొంతమంది జుట్టుతినడం లాంటివాటిని తింటారు. పెద్దయ్యే కొద్దీ ఈ అలవాట్లను మానివేస్తారు. కానీ ఇలాంటి అలవాట్ల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఒక్కోసారి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మధ్య ప్రదేశ్‌లోని జరిగిన ఉదంతం గురించి తెలిస్తే.. వామ్మో అనాల్సిందే. విషయం ఏమిటంటే..
అహ్మదాబాద్ వైద్యులు 7 ఏళ్ల బాలుడి కడుపు నుండి భారీ మొత్తంలో ఉండగట్టిన వెంట్రెకలు, గడ్డి, షూలేస్ దారం లాంటి వాటిని తొలగించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మధ్యప్రదేశ్‌లోని రత్లాం నివాసి శుభం నిమానా (7) గత రెండు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. ఎన్ని అసుపత్రులకు తిరిగినా, లక్షలు వెచ్చించినా ఫలితం కనిపించలేదు. పైగా రోజు రోజుకి బరువు తగ్గడం మొదలైంది. మధ్య ప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు రూ. 2 లక్షల ఖర్చు చేసినప్పటికీ, అతని పరిస్థితి మెరుగుపడలేదు.దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ వైద్యులను సంప్రదించారు. అక్కడి వైద్యులు CT స్కాన్, ఎండోస్కోపీ లాంటి పరీక్షల్లో అసలు విషయం బయటపడింది. అతని కడుపులో ఏవో కొన్ని వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి గడ్డలాగా మారినట్టు గురించారు. బాలుడి కడుపులో హెయిర్ బాల్, గడ్డి షూలేస్ దారం పేరుకుపోయాయి. దీన్నే వైద్య భాషలో ట్రైకోబెజోవర్(trichobezoar)అని. దీంతో బాలుడ్నిని ఆరురోజులు నోటి ద్వారా ఎలాంటి ఆహారం ఇవ్వకుండా, ఏడో రోజున అతికష్టంమీద విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్ తర్వాత బాలుడికి కౌన్సెలింగ్, చికిత్స అందించినట్టు వైద్యులు తెలిపారు.
అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి మాట్లాడుతూ, "పిల్లలలో ట్రైకోబెజోర్లు చాలా అరుదు, కానీ తల్లిదండ్రులు పిల్లలలో ఇలాంటి అసాధారణమైన అలవాట్లను గమనించినపుడు, వైద్యులను సంప్రదించి ప్రాణాంతక పరిస్థితులను నివారించాలని సూచించారు.
చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారు

ట్రైకోబెజోవర్ అంటే ఏమిటి?
ట్రైకోబెజోవర్ అనేది ఒక రకమైన బెజోవర్ - జీర్ణశయాంతర వ్యవస్థలో పేరుకుపోయే ముద్ద - ప్రధానంగా జుట్టు లాంటివి తినడం వల్ల ఇది వస్తుంది. తరచుగా ట్రైకోటిల్లోమానియా (కంపల్సివ్ హెయిర్-పుల్లింగ్), ట్రైకోఫాగియా (జుట్టు తినడం) ఇంకా దారం లేదా గడ్డి వంటి జీర్ణం కాని ఇతర పదార్థాలను తినడం వల్ల ఇవి ఏర్పడతాయి. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బట్టి బెజోవర్లను నాలుగు ప్రధానరకాలుగా పేర్కొంటారు.
లక్షణాలు: కడుపు నొప్పి, వాంతులు, ఉబ్బరం, బరువు తగ్గడం, మలబద్ధకం లాంటివి ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, పేగు అవరోధం. చిన్న మొత్తాలను ఎండోస్కోపికల్ ద్వారా తొలగించగలిగినప్పటికీ, పెద్ద వాటికి తరచుగా శస్త్రచికిత్స జోక్యం అవసరం. ముఖ్యంగా పిల్లలలో పునరావృతం కాకుండా నిరోధించడానికి మానసిక సలహా కూడా అవసరం.