wash
-
బియ్యాన్ని తప్పనిసరిగా కడగాలా? నిపుణులు ఏమంటున్నారంటే..!
మన భారతదేశంలో బియ్యమే ప్రధాన ఆహారం. ఎన్ని వెరైటీ టిఫిన్లు తిన్నా.. నాలుగు మెతుకులు కడిపులో పడితేనే హాయిగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకు మంచి శక్తినిచ్చి ఎక్కువ సేపు పనిచేయగలిగే సామర్థ్యాన్ని అందించేది బియ్యం మాత్రమే. అలాంటి బియ్యాన్ని వండటానికి ముందు తప్పనిసరిగా కడగాల్సిందేనా? మరి నిపుణులు ఏమంటున్నారు..? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన మంచి ఆహారం. కార్బోహైడ్రైట్లకు మూలం. పైగా శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పౌష్టికమైన ఆహారం కూడా. మనల్ని శక్తిమంతంగా ఉండేలా చేసేది, చక్కగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి కసరత్తులు చేయడానికి తోడ్పడేది అయిన బియ్యంలో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, ఫైబర్, బీ విటమిన్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అలాంటి బియ్యాన్ని వండడానికి ముందు కడగడం అవసరమా అంటే..? ఎందుకు కడగాలంటే.. నిపుణులు తప్పనిసరిగా బియ్యాన్ని వండటానికి ముందు కడగాల్సిందేనని చెబుతున్నారు. ఆర్సెనిక్ వంటి విష పదార్థాలు ఉంటాయని, అందువల్ల కడగాలని తెలిపారు. నానాబెట్టి కడగడం ఇంకా మంచిదని, దీనివల్ల ఆ బియ్యంలో ఉన్న ఆర్సెనిక్, మట్టి వంటివి నీటిలో కరిగి సులభంగా కరిగి బయటకి వెళ్లిపోతాయని అన్నారు. ఇలా చేస్తే ఆరోగ్యానికి హాని కలిగించే ధూళి, గులకరాళ్లు, మిగిలిపోయిన శిథిలాలు వంటి అవాంఛనీయ పదార్థాలు ఏమైనా ఉన్నా కడగడం వల్ల నీళ్ల ద్వారా బయటకు వెళ్లిపోయి బియ్యం చక్కగా క్లీన్ అవుతాయని పేర్కొన్నారు. ఇలా కడిగితే ఆ బియ్యంపై ఉండే పిండిలాంటి పదార్థం బయటకు పోయి అన్నం చక్కగా అతుక్కోకుండా పొడిపొడిగా ఉటుందని చెప్పారు. అలాగే ఇలా వాష్ చేస్తే మైక్రో ప్లాస్టిక్‌లను ఈజీగా తొలగించగలమని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ కార్యకలాపాలు, బొగ్గును కాల్చడం వంటి వాటివల్ల భూగర్భజలాల్లోకి ఆర్సెనిక్ సులభంగా ప్రవేశిస్తుంది. పలితంగా భారీగా నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అక్కడ నుంచి ఆ నీరు కాస్త పంట నీటి పారుదలకు, వంట కోసం ఉపయోగించే వాటిలోకి సరఫరా అవుతుంది. అందులోనూ వరి మరీ ఎక్కువగా ఆర్సెనిక్ కలుషితానికి గురవ్వుతుంది. ఎందుకంటే..? వరిపోలాలకు నీటి అవసరం ఎక్కువ, పైగా వరదల టైంలో ముంపునకు గురవ్వుతాయి కూడా. అలా.. ఈ ఆర్సెనిక్ వాటిలో ఎక్కువగా ఉంటుంది. ఆర్సెనిక్ వల్ల వచ్చే సమస్యలు ఎరుపు లేదా వాపు చర్మం కొత్త మొటిమలు లేదా గాయాలు పొత్తికడుపు నొప్పి వికారం, వాంతులు అతిసారం అసాధారణ గుండె లయ కండరాల తిమ్మిరి వేళ్లు, కాలి జలదరింపు చర్మం నల్లబడటం గొంతు నొప్పి నిరంతర జీర్ణ సమస్యలు మొదలైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దీర్ఘకాలిక లక్షణాలు మొదట చర్మంపై కనిపిస్తాయి. ఆ తర్వాత ఇలా బహిర్గతం అయిన ఐదు ఏళ్లలోపు అందుకు సంబంధించిన కేసులు, మరణాలు నమోదవ్వుతాయి. అందువల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తినాలనుకుంటే బియ్యాన్ని తప్పనిసరిగా శభ్రంగా కడగాలని నిపుణులు చెబుతున్నారు. గుర్తుంచుకోవలసిన విషయాలు.. ఆరోగ్యకరమైన, రుచికరమైన అన్నం తయారీకి గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వంటి వారు గ్లూకోజ్ కంటెంట్ తక్కువగా ఉండాలనుకుంటే.. నానాబెట్టి చక్కగా కడిగి వండుకోవాలని సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు బ్రౌన్ రైస్ వంటి వాటిని తినండి. బ్రౌన్‌రైస్ వైట్‌రైస్ కంటే ఎక్కువ ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉంటుంది. (చదవండి: జైల్లో బరువు తగ్గిన కేజ్రీవాల్:మధుమేహం కారణమా?) -
Video: తీరానికి కొట్టుకొచ్చిన వేలాది చేపలు
టోక్యో: ఉత్తర జపాన్ బీచ్‌లో వేలాది చేపలు మృతి చెందాయి. జపాన్ ఉత్తర ద్వీపం హక్కైడోలోని హకోడేట్లో వేలాది చేపలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. సముద్ర కెరటాలను కమ్మేసిన మృతి చెందిన చేపలు చూసిన అధికారులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ చేపలను తినకూడదని స్థానికులకు తెలిపారు. చేపల మరణానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ ఫుకుషిమా అణు కర్మాగారం నుంచి విడుదలైన రేడియోధార్మిక పదార్థాలతో కూడిన నీటిని విడుదల చేయడమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. Massive number of dead fish washing up along the coast of northern Japan pic.twitter.com/xeCn4yv5xB— DeepCoverPatriot☦️ (@samuelculper3rd) December 7, 2023 ఈ ఏడాది అక్టోబర్‌లో జపాన్ ఫుకుషిమా అణు కర్మాగారం నుండి మురుగునీటిని విడుదల చేసింది. ఈ చర్యను చైనా ఖండించింది. 2011 నుండి సేకరించబడిన 1.34 మిలియన్ టన్నుల మురుగునీటిలో కొంత భాగాన్ని పసిఫిక్‌లోకి జపాన్ మొదటిసారి ఆగష్టు 24న విడుదల చేసింది. మార్చి 2011లో సంభవించిన భూకంపం, సునామీ కారణంగా ఫుకుషిమా పవర్ ప్లాంట్ ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి -
తలకు షాంపూ.. ఇలా ఐతే మంచిది!
ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి జుట్టు తొందరగా జిడ్డుపట్టే తత్త్వం ఉంటుంది. వీటినుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల మంచి ఫలితాల మాట ఎలా ఉన్నా, కొన్ని రోజుల తర్వాత జుట్టు చెడిపోతుంది. అయితే షాంపూ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. తలకు నూనె పట్టించడం షాంపూ చేయడానికి ముందు జుట్టుకు తప్పకుండా నూనెను అప్లై చేయాలి. తలకు నూనెను పట్టించిన రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేయడం మంచిది. తల దువ్వుకోవడం షాంపూ చేయడానికి ముందు జుట్టును బాగా దువ్వాలి. దువ్విన తర్వాత షాంపూను అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సల్ఫేట్ రహిత షాంపూలు సో బెటర్ ప్రస్తుతం చాలా మంది బాగా గాఢంగా ఉండే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా మైల్డ్‌గా.. సల్ఫేట్ రహితంగా ఉండే షాంపూలను వినియోగించడం మంచిది. తలకు చన్నీరే మంచిది జుట్టు సమస్యలతో బాధపడేవారు తలస్నానం చేసే సమయంలో చల్లని లేదా గోరువెచ్చటి నీటితో మాత్రమే చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు మొదళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. (చదవండి: అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!) -
పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా?
కొందరూ రాత్రి పడుకునేటప్పుడూ చక్కగా ముఖం కడుక్కుని పడుకుంటారు. ఇలా చేయడం మంచిదా? కాదా? . మరికొందరూ మాత్రం రాత్రిపూట ముఖం కడిగితే ఎక్కడ నిద్రపట్టదనో అస్సలు కడగరు. ఫ్రెష్‌నెస్ ఉంటే ఇంక నిద్ర ఏం వస్తుందని అనే వారు ఉన్నారు. అసులు ఇది ఎంతవరకు మంచిది. అలాగే కొందరు దగ్గర దుర్గంధం వస్తుంది. ఎన్ని ఫెరఫ్యూమ్లు వాడిన ఆ దుర్వాసన ఓ పట్టాన పోదు. ఇలాంటి వాళ్లు ఎలాంటి చిట్కాలు పాటిస్తే మంచిదో తెలుసుకుందాం. రాత్రి సమయంలో ముఖం కడగొచ్చా.. రాత్రి పడుకునే ముందు ముఖాన్ని కడుక్కుంటే మీ ముఖం మరింత కాంతిమంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూసేయండి. సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, కాటన్ వస్త్రంతో తడిలేకుండా తుడిచి ఆ తరువాత పడుకోవాలి. రోజూ పడుకునేముందు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన మురికి, మట్టి వదిలి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద ఉండే సూక్ష్మ రంధ్రాలు చక్కగా శ్వాసిస్తాయి. దీనివల్ల ముడతలు తగ్గి చర్మం కాంతిమంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది మొటిమల ముప్పు తగ్గుతుంది. పడుకునే ముందు ముఖాన్ని కడగడం వల్ల చర్మానికి తేమ అంది పొడిబారకుండా ఉంటుంది. పొడిచర్మం ఉన్న వారు రోజూ పడుకునేముందు ముఖం కడుక్కోవడం అలవాటు చేసుకుంటే మంచిది. చర్మం మీద ముడతలు, కాలిన గాయాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్,గీతలు, మచ్చలు తగ్గాలంటే పచ్చి బంగాళాదుంపను తురిమి ముఖం మీద ప్యాక్వేయాలి లేదా మర్దన చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నెల రోజులుచేస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరం దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలంటే.. స్నానం చేసే నీటిలో పటికముక్కలను వేసి రెండు గంటలపాటు నానబెట్టాలి. పటిక మొత్తం కరిగిన తరువాత ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం తరువాత శరీరాన్ని తడిలేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా స్నానం చేస్తే రోజంతా దుర్వాసన లేకుండా తాజాగా ఉంటారు. వీలైతే రాత్రంతా పటికను నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీటితో స్నానం చేస్తే మరీ మంచిది. అరటిపండు, బ్రకోలి, సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో అధికంగా చేర్చుకుంటే... చర్మం జిడ్డుతనం తగ్గి ఆరోగ్యంగా తయారవుతుంది. (చదవండి: మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం!) -
ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్ ఉతకనవసరం లేదు!
దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్ ధరిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్‌పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్ వినియోగిస్తున్నారు. జీన్స్ ధారణ మనిషికి మంచి లుక్‌నిస్తుంది. కొందరు జీన్స్‌ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్‌ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు. అయితే జీన్స్‌ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్‌ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్ పాడయిపోతుంది. అలాగే జీన్స్‌ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్ సీఈఓ చిప్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్‌ను కనీసం 6 నెలల తరువాతనే వాష్ చెయ్యాలి. అయితే జీన్స్‌ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్‌లో నుంచి జీన్స్‌ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
స్పెషల్ ఫోకస్
బాలీవుడ్‌పై జ్యోతిక స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. వరుసగా ఆమె హిందీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీ చిత్రం ‘శ్రీ’లో నటించారు జ్యోతిక. వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్ చేశారు. అలాగే ఓ హిందీ వెబ్ సిరీస్‌కు జ్యోతిక సైన్ చేశారనే టాక్ కొన్ని నెలల క్రితం బీటౌన్‌లో బలంగా వినిపించింది. తాజాగా మరో హిందీ ప్రాజెక్ట్‌కు జ్యోతిక సై అన్నారు. వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో జ్యోతిక కనిపిస్తారట. గుజరాతీ ఫిల్మ్ ‘వష్’కు ఈ చిత్రం రీమేక్ అని భోగట్టా. -
18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..!
లండన్: జీన్స్ ధరించే వారు ఒకట్రెండు సార్లు వేసుకున్న తర్వాత కచ్చితంగా వాటిని వాష్ చేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం 18 ఏళ్లుగా తన రెండు జీన్స్ ప్యాంట్లను ఉతకలేదట. ఆపై అవి ఇంకా కొత్త వాటిలాగే ఉన్నాయని చెబుతోంది. కొన్నప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు అలాగే ఉన్నాయంటోంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. ఇంగ్లాండ్ యార్క్‌షైర్‌కు చెందిన ఈ మహిళ పేరు సాండ్రా విల్లిస్. 18 ఏళ్ల క్రితం ఓ జత ఎంఎస్ డెనిమ్ జీన్స్ ప్యాంట్లను కొనుగులు చేసింది. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే వాటిని ధరిస్తోందట. వాటిపై ఒక్క మరక కూడా లేకపోవడంతో వాష్ చేయాలనిపించడం లేదట. ఈమె సెంటు బాగా వాడటంతో జీన్స్ కూడా చెమట వాసన రావడం లేదట. ఇక ఎందుకు ఉతకడం అనుకుని వాటిని అలాగే ఉంచుతోంది. దీంతో ఆ జీన్స్ ప్యాంట్లు చెక్కు చెదరకుండా అలాగే కొత్తగా ఉన్నాయని చెబుతోంది సాండ్రా. ఇంకో రెండేళ్లు కూడా వాటిని ఉతకనంటోంది. 20 ఏళ్లు జీన్స్ ఉతకకుండా రికార్డు సృష్టించాలనుకుంటోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. జీన్స్ ప్యాంట్‌ను ఉతక్కుండా 20 సార్లు వేసుకుంటారా? నేనైతే ఒకట్రెండు సార్లు ధరిస్తే వెంటనే వాష్ చేస్తా.. అని పలువురు నెటిజన్లు అంటున్నారు. అసలు మీరు జీన్స్‌ను ఎందుకు ఉతకడం లేదు? అని మరో యూజర్ ప్రశ్నించాడు. దీనికి సాండ్రా బదులిస్తూ.. తాను జీన్స్‌ను ఉతకకపోయినప్పటికీ వాటిని శుభ్రంగా తూడుస్తానని చెప్పారు. అందుకే అవి కొత్తగా ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా వాటిని ఉతకాలని అన్పించినప్పుడు వాష్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంతే కాదు తన వద్ద చాలా జతల జీన్స్ ఉన్నాయని, అందుకే వీటిని ఏడాదికి ఒక్కసారే ధరించినట్లు వివరించారు. వాటిపై ఏమైనా మరకలు పడితే అప్పుడు కచ్చితంగా వెంటనే వాష్ చేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం అవి చాలా కొత్తగానే ఉన్నాయన్నారు. చదవండి: వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి? -
వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు!
ఇంతవరకు పాములకు సంబంధించిన భయానక స్టంట్లు చూశాం. వాస్తవానికి ఇది స్టంట్ కాదు కానీ ఏదో కుక్కపిల్లకి స్నానం చేయించినట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి చాలా పొడువుగా ఉన్న కింగ్ కోబ్రాకి తల మీద నుంచి నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. పైగా ఆ పాము అతడు నీళ్లు పోస్తున్న మగ్గును పలుమార్లు కాటేస్తోంది కూడా. కానీ ఆ వ్యక్తి అదేం పట్టించుకోకుండా చక్కగా కోబ్రాకి స్నానం చేయించే పనిలో ఉన్నాడు. మహిళలు పురుషుల కంటే 5% ఎక్కువగా బతకడానికి కారణం ఇదే నంటూ ఈ వీడియో గురించి చెబుతున్నారు. ఎందుకంటే పురుషులు డేరింగ్ స్టంట్ చేస్తుంటారు అందువల్ల ఎక్కువ కాలం జీవించరంటూ గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ మేరకు ఒక ఇన్‌స్ట్రాగామ్ వినియోగదారుడు ఎందుకు మహిళలు పురుషులకంటే ఎక్కవ కాలం జీవిస్తారో తెలుసా! అంటూ "చన్నీటితో కోబ్రాకి బాత్ " అనే క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by SAKHT LOGG 🔥 (@sakhtlogg) (చదవండి: ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా!) -
మోకాలి నొప్పా.. బ్రెయిన్ వాషా?
-
రాష్ట్రవ్యాప్తంగా ‘వాష్’
స్వచ్ఛభారత్‌లో భాగంగా అమలు నీరు, పారిశుధ్యానికి ప్రాధాన్యత 150 మండలాల్లో 13 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పైలట్ ప్రాజెక్టు కింద 12 గ్రామాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాం తాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. స్వచ్ఛభారత్ అమల్లో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’ (నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత) కార్యక్రమాన్ని ప్రారంభించాలని సర్కారు సంకల్పించింది. దీన్ని ఈ నెల రెండో వారంలో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ‘వాష్’ ద్వారా వ్యక్తిగత పరిశుభ్రతపట్ల విస్తృత అవగాహన, మరుగుదొడ్ల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద 9 జిల్లాల నుంచి 12 గ్రామాలను ఎంపిక చేసింది. ఆయా గ్రామాల్లోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్ల సదుపాయాన్ని కల్పించనుంది. ఫలితాలను సమీక్షించిన తర్వాత మిగిలిన గ్రామాలకూ విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ‘వాష్’ అమలు నిమిత్తం మొదటి విడతగా రూ.47.56 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో కేంద్రం వాటా రూ. 33.3 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.14.26 కోట్లు విడుదల చేసింది. ‘వాష్’ అమలు ఇలా.. ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ అమలు బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేసేలా చర్యలు చేపడతారు. ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజ లను చైతన్యం చేస్తారు. ఎంపిక చేసిన వలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుధ్యం అంశాలకు సంబంధించి గ్రామంలో కుటుంబాల వారీగా బేస్‌లైన్ సర్వే నిర్వహిస్తారు. వలంటీర్లకు ఇందిరా క్రాంతి పథం సిబ్బంది సహకరిస్తారు. సర్వేలో వెల్లడైన వివరాలను గ్రామసభలో చర్చించి నిర్ణీత సమయంలోగా ప్రతి కుటుం బం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ప్రొక్యూర్మెంట్, నిర్మాణం, నిఘా పేరుతో 3 ఉపకమిటీలను నియమిస్తారు. కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పం చ్, వార్డు సభ్యులు ఉంటారు. వాష్ కమిటీలకు సర్పంచులే అధిపతులుగా వ్యవహరిస్తారు. ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200 ఇస్తారు. విరాళాలనూ సేకరించవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు రివాల్వింగ్ ఫండ్‌ను గ్రామీణ నీటి పారుదల, పారిశుధ్య (ఆర్డబ్ల్యూఎస్ఎస్) విభాగం అందజేస్తుంది. ఈ నిధులను గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్‌గా వినియోగించుకోవచ్చు. -
నాన్‌స్టిక్... వాడటం రావాలి!
పదార్థాలు అంటుకోకుండా ఉండే లక్షణమే మనల్ని నాన్‌స్టిక్ వంట సామాగ్రి వాడేలా చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఎంత ఖరీదైనవి కొన్నా... కొద్ది రోజులకే తమ గుణాన్ని కోల్పోయి వంటకాల్ని మాడ్చేస్తుంటాయి. కనీసం ఐదేళ్లపాటు పనికి రావాల్సిన గిన్నెలు అంత త్వరగా పాడవడానికి కారణం... మనకు వాటిని వాడటం చేతకాకపోవడమే! నాన్‌స్టిక్ అనేది నూనె వాడక్కర్లేకుండా వండుకోవడానికే తయారు చేశారు. కాబట్టి వీలైనంత వరకూ నూనె జోలికి పోవద్దు. అస్తమానం నూనె వేసి వండుతుంటే పాడైపోతాయి! వంట చేసేటప్పుడు స్టీలు గరిటెలు ఉపయోగించవద్దు. అవి గిన్నెలోని టెఫ్లాన్ కోటింగును పాడు చేస్తాయి. కాబట్టి చెక్క గరిటెలను మాత్రమే వాడాలి. నాన్‌స్టిక్ గిన్నెలను అన్ని గిన్నెలతో కలిపి వాష్ బేసిన్లో వేయవద్దు. వాటిని ఎప్పుడూ వేరుగా ఉంచి శుభ్రం చేసుకోవాలి. మామూలు గిన్నెలకు వాడే లిక్విడ్, సబ్బు వాడకూడదు. గిన్నెనిండా నీరు పోసి, కాసింత వెనిగర్ కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. జిడ్డు తట్టులా తేలిపోతుంది. అప్పుడు నీటిని వంపేసి మెత్తని గుడ్డతో కానీ స్పాంజితో కానీ తుడిచేయాలి. నాన్‌స్టిక్ గిన్నెల్లో వండే టప్పుడు మంట ఫుల్లుగా పెట్టకూడదని మీకు తెలుసా? ఎప్పుడూ మీడియంలో కానీ, సిమ్‌లో కానీ మాత్రమే పెట్టాలి. మితిమీరిన వేడి నాన్ స్టిక్ గిన్నెల్ని పాడు చేస్తుందన్నది నిరూపణ అయిన వాస్తవం. -
ఇలా అంటే.. అలా ఆరిపోద్ది..
తలస్నానం చేశాం.. శిరోజాలను ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రయర్ కోసం వెతుకుతున్నారా? ఇకపై అలాంటివక్కర్లేదు. పర్యావరణ అనుకూలమైన ఈ హెయిర్ డ్రయింగ్ గ్లోవ్స్ ఉంటే చాలు. ఎంచక్కా.. జుత్తును ఆరబెట్టేసుకోవచ్చు. ఇందులో ఉండే అత్యాధునికమైన మైక్రో ఫైబర్లు వెంటనే నీటిని పీల్చేసుకుంటాయి. పైగా.. వేడి గాలితో జుత్తును ఆరబెట్టడం వల్ల శిరోజాలు పాడయ్యే అవకాశమూ ఉందని దీన్ని విక్రయిస్తున్న ఆన్లైన్ రీటైల్ సంస్థ ‘హెమాకర్ ష్లెమర్’ తెలిపింది. మామూలు తువ్వాలుతో పోలిస్తే.. ఈ మైక్రో ఫైబర్లు రెండు రెట్లు అధికంగా నీటిని పీల్చుకుంటాయట. దీని ధర రూ.1,300