ఇది కేఎఫ్‌సీ చికెన్ కాదు సుమీ.. | Viral: Woman Finds Crystal Looks Like Fried Chicken | Sakshi
Sakshi News home page

చికెన్ ముక్క‌‌లా క‌నిపిస్తున్న ఇదేంటో తెలుసా?

Jun 30 2020 8:56 PM | Updated on Jun 30 2020 9:08 PM

Viral: Woman Finds Crystal Looks Like Fried Chicken - Sakshi

ఫొటో చూడ‌గానే లొట్ట‌లేయ‌కండి.. కేఎఫ్‌సీ చికెన్ అని అస్స‌లు భ్ర‌మ‌ప‌డ‌కండి.. క‌న్నార్ప‌కుండా చూస్తూ ఆక‌లి తెచ్చుకోకండి. ఇంత‌కీ అదేంటా! అని ఆలోచిస్తున్నారా? మ‌రేం లేదు. అది కేవలం ఓ రాయి. అమేలియా రూడీ బ్రాస్‌లెట్ బిజినెస్ నిర్వ‌హ‌స్తుంది. ఇందుకోసం ఆమె ర‌క‌రకాల రాళ్లు సేక‌రిస్తుంది. ఈ క్ర‌మంలో రూడీకి త‌న‌ స్నేహితురాలు ఓ రాయిని ఇచ్చింది. దాన్ని చూడ‌గానే ఆమె ఒక్క క్ష‌ణం పాటు తత్త‌ర‌పాటుకు లోనైంది. అది ఎంతో ప్రత్యేకంగా క‌నిపించ‌డంతో రాయి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా నెటిజ‌న్లు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. (చికెన్, గుడ్లతో రోగనిరోధక శక్తి)

హే.. చికెన్ అనుకుని నోట్లో ఊరిళ్లూరేలోపే దాని క్యాప్ష‌న్ చ‌దివి రాయి అని తెలుసుకుని ఉసూరుమంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఫొటోకు 2.8 ల‌క్ష‌ల లైకులు రాగా వేలాది కామెంట్లు వ‌చ్చి ప‌డుతున్నాయి. చికెన్ ఫ్రైను పోలిన రాళ్ల ఫొటో‌ను ప‌లువురు షేర్ చేస్తున్నారు. వీటితో పాటు చీజ్ కేక్‌, బంగాళాదుంప‌, మాంసాన్ని పోలిన రాళ్ల ఫొటోలు ప్ర‌త్య‌క్ష‌మై ఆహార‌ప్రియుల‌కు నోరూరించేలా చేస్తున్నాయి. (ఈ ఆట పేరేంటో మీకు గుర్తుందా?)

Advertisement
 
Advertisement
Advertisement