వైరల్‌: బొటనవేలు అతడిని సెలబ్రెటీని చేసింది | Viral Video Student Have A 5 Inch Long Thumb | Sakshi
Sakshi News home page

వైరల్‌: బొటనవేలు అతడిని సెలబ్రెటీని చేసింది

Sep 2 2019 3:44 PM | Updated on Sep 2 2019 4:06 PM

Viral Video Student Have A 5 Inch Long Thumb - Sakshi

కుడి చేతి బొటన వేలు కారణంగా ఆ యువకుడు పెద్ద సెలబ్రెటీ..

బోస్టన్‌ : తన కుడి చేతి బొటనవేలు పుణ్యమా అని ఆ యువకుడు పెద్ద సెలబ్రెటీ అయిపోయాడు. దాని ప్రత్యేకత కారణంగా సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌ అయ్యాడు. ఇంతకీ ఆ బొటనవేలు ప్రత్యేకత ఏంటంటే.. మామూలుకంటే రెట్టింపు పొడవుగా ఉండటం. మామూలుగా అందరికి 2.5 అంగుళాల బొటనవేలు ఉంటే మసాచుసెట్స్‌కు చెందిన జాకబ్‌ పిన అనే యువకుడికి మాత్రం ఎకంగా ఐదు అంగళాల పొడవుండే బొటనవేలు ఉంది. వేలి ప్రత్యేక కారణంగా టాల్క్‌ ఆఫ్‌ ది టిక్‌టాక్‌గా మారాడు జాకబ్‌.

బొటనవేలి ప్రత్యేకతను చాటేలా వీడియోలను చేసి టిక్‌టాక్‌లో ఉంచుతున్నాడు. ఈ మధ్య చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దానికి 2.1 మిలియన్ల లైకులు రాగా 37 వేలమంది కామెంట్లు చేశారు. బొటనవేలి కారణంగా టిక్‌టాక్‌లో 1.5 లక్షల మంది జాకబ్‌కు ఫ్యాన్స్‌ అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement