నిజంగానే అక్కడేదో ఉంది; మీకు కనిపించిందా? | Viral Video: Mysterious Object Caught On camera | Sakshi
Sakshi News home page

వైరల్‌: అది దయ్యమే.. కాదంటారా?

Feb 11 2020 12:42 PM | Updated on Feb 11 2020 1:11 PM

Viral Video: Mysterious Object Caught On camera - Sakshi

ఇప్పటికీ దయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ కొందరు మాత్రం అసలు దయ్యమే లేదని, 5జీ యుగంలో వాటికి చోటెక్కడిదంటూ తేలికగా తీసిపారేస్తారు నేటి తరం మనుషులు. కానీ ఏదైనా మిస్టరీగా కనిపించే ఫొటోలు, వీడియోలు చూస్తే మాత్రం మానవమాత్రులకు అంతుచిక్కనిదేదో ఉందంటూ బుర్రలు బద్ధలు కొట్టుకుంటారు. కొంపతీసి దయ్యమేమో అని భయంతో బిగుసుకుపోయేవాళ్లూ లేకపోలేదు. తాజాగా ‘ఇందులో ఉన్నది ఏంటో కనుక్కోండి..’ అంటూ ఓ వ్యక్తి షేర్‌ చేసిన వీడియో నెటిజన్ల మేధస్సుకు పదును పెడుతోంది. 

కటిక చీకటి కమ్ముకున్నట్లు కనిపిస్తున్న ఈ వీడియో 20 సెకండ్ల నిడివి ఉంది. ఈ వీడియోలో ఏదో తెల్లగా కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఇది నిజమేనా అని కళ్లు పెద్దవి చేసి చూసేసరికి మరోసారి ఆ రూపం కదులుతూ వెళ్లడం గమనించవచ్చు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇది దయ్యమే, జాగ్రత్తగా ఉండండి’ అని కొందరు, ‘ఇలాంటివి చాలా చూశాం.. ఇది తప్పకుండా ఫేక్‌’ అని మరికొందరు వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ‘అది కెమెరా జిమ్మిక్కు’ అని తేలికగా తీసిపారేశాడో వ్యక్తి. ‘నిజంగానే అక్కడేదో ఉంది.. ఈ విషయం జీర్ణించుకోడానికి కష్టంగా ఉన్నా నమ్మి తీరాల్సిందే’నంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరి మీరేం అంటారు.

Advertisement
 
Advertisement
Advertisement