భార్యను కారు బానెట్‌కు కట్టేసి..... | video shows Costa Rica man tie woman to his car after accusing her of cheating | Sakshi
Sakshi News home page

భార్యను కారు బానెట్‌కు కట్టేసి.....

Apr 20 2016 6:14 PM | Updated on Jul 27 2018 2:18 PM

భార్యను కారు బానెట్‌కు కట్టేసి..... - Sakshi

భార్యను కారు బానెట్‌కు కట్టేసి.....

షాకింగ్‌ వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చెక్కర్లు కొడుతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన భార్యను కారు బానెట్‌కు కట్టేసి కారును అతివేగంగా నడిపిన వీడియో అది.

శాన్‌ జోస్‌: షాకింగ్‌ వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చెక్కర్లు కొడుతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన భార్యను కారు బానెట్‌కు కట్టేసి కారును అతివేగంగా నడిపిన వీడియో అది. హెల్ప్‌...హెల్ప్‌ అని ఆమె అరవడం. అలా అరచినప్పుడు కారును క్షణకాలం ఆపినట్టే ఆపి మళ్లీ వేగంగా పరుగెత్తించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. కోస్టారికాలోని ఓ రోడ్డులో దూసుకుపోయిన ఆ కారు కొంత సేపటికి అదృశ్యమవుతుంది.

 

కారు బానెట్‌పై కట్టేసి ఉన్న నీలి రంగు జీన్స్, ఎర్రటి చొక్కా ధరించిన ఆ యువతి చివరకు ఏమైందో కూడా తెలియదని స్థానిక మీడియా పేర్కొంది. భార్య తనను ఛీట్‌ చేస్తూ మరో బాయ్‌ ఫ్రెండ్‌తో తిరుగుతోందనే అనుమానంతోనే ఆ భర్త ఈ అఘాత్యానికి పాల్పడ్డాడట. అంతేకాకుండా ఆ యువతి కారు బానెట్‌పై ప్రాణాలు బిగపట్టి హెల్ప్‌...హెల్ప్‌ అని అరచినప్పుడు భర్త పేరు ఉచ్ఛరించకుండా బాయ్‌ ఫ్రెండ్‌ పేరే ఉచ్ఛరించిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement