'మా డబ్బులు కావాలంటే పాక్‌ ఇవి చేయాలి'

US Tells Pakistan What It Must Do to Continue Receiving Funds - Sakshi

వాషింగ్టన్‌ : తమ దేశం నుంచి ఆర్థిక సాయం కావాలంటే పాకిస్థాన్‌ కొన్ని తప్పకుండా చేయాలని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు పెంటగాన్‌ అధికారిక ప్రతినిధి కలోనెల్‌ రాబ్‌ మ్యానింగ్‌ విలేకరులకు కొన్ని విషయాలు వెల్లడించారు. 'మేం అనుకున్నది చాలా సూటిగా చెప్పాం. మా అంచనాలు కూడా డొంకతిరుగుడు లేకుడా సూటిగా ఉన్నాయి. మా నుంచి పాకిస్థాన్‌కు డబ్బు సాయం కావాలంటే మేం చెప్పే ఈ పనులు చేయాల్సిందే. అవేమిటంటే..

1. తాలిబన్‌ ఉగ్రవాదులను తుదముట్టించడం
2. హక్కానీ నెట్‌వర్క్‌ను, నాయకత్వాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం
3. ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం చేయడం
4. పాక్‌లో ఉగ్రవాదులకు చోటే లేకుండా చేయడం
5. పాక్‌ నుంచి వేరే ప్రాంతాలపై ఎలాంటి దాడులు జరగకుండా చూసుకోవడం

ప్రస్తుతానికి పైన పేర్కొన్న అంశాలు తమ ప్రాధాన్యత అంశాలని, అవన్నీ పాక్‌ చేస్తే ఎప్పటిలాగే వందల మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం పాక్‌ అందుతుందని మ్యానింగ్‌ చెప్పారు. ప్రతి ఏడాది ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్‌కు 900 మిలియన్‌ డాలర్ల సాయాన్ని అమెరికా చేస్తోంది. అలాగే, సైన్యం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు కూడా ఒక బిలియన్‌ డాలర్ల సాయాన్ని చేస్తోంది. అయితే, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే కారణంతో ఆ నిధులన్నింటిని ట్రంప్‌ సీజ్‌ చేశారు. పాక్‌ తీరు మార్చుకోకుంటే వాటిని అమెరికాలో రోడ్లు, వంతెనలు నిర్మించేందుకు ఉపయోగించడని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top