
చివరి చేపకు గాలం వేసి మరీ..!
అమెరికా నేవీలో సుదీర్ఘకాలం సేవలందించి రిటైరయ్యారు కాన్నే విల్ హైట్.
అమెరికా నేవీలో సుదీర్ఘకాలం సేవలందించి రిటైరయ్యారు కాన్నే విల్ హైట్. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన తన చివరి కోరిక అంటూ రెండింటిని కోరాడు. అందులో ఒకటి బాప్తిజం తీసుకోవడం, రెండోది మాత్రం కాస్త కష్టమైన పని. చివరిసారిగా ఫిషింగ్ చేసి చేపలకు గాలం వేయాలనే కోరికను వెలిబుచ్చారు. ఆయన చివరిరోజుల్లో డబ్లిన్ లోని కార్ల్ విన్సన్ వీఏ మెడికల్ సెంటర్లో చికిత్స పొందారు.
కాన్నే విల్ హైట్ కోరికలను మెడికల్ సెంటర్ తీర్చడానికి అంగీకరించింది. చాప్లెన్ స్కాగ్స్ అనే వ్యక్తి ఆయనకు బాప్తిజం ఇప్పించారు. బాప్తిజం తీసుకుంటే తనకు పుణ్యాలోకాలు ప్రాప్తిస్తాయని ఆయన భావించారు. రెండో కోరిక ప్రకారం.. ఆస్పత్రి బెడ్ మీద నుంచి కనీసం లేవలేని పరిస్థితుల్లో ఉన్న మాజీ అధికారి కాన్నేని జార్జియాలోని మెడికల్ సెంటర్ సమీపంలోని లీజర్ లేక్ వద్దకు తీసుకెళ్లారు.
నర్సులతో పాటు కొందరు స్టాఫ్ ఈ కార్యంలో భాగస్వాములు అవ్వాలని భావించారు. కదలలేని స్థితిలో ఉన్నాడు కనీసం ఒక్క చేపను పడతాడా లేదా అని అందరూ అనుమానం వ్యక్తం చేయగా ఓవరాల్ గా ఆ రోజు ఏకంగా నాలుగు చేపలను పట్టేశారు. ఒక ఇంకేం ఆయన జీవిత చివరి కోరికలు తీరిపోయాయి. ఆ తర్వాత సరిగ్గా మూడోరోజున(గత ఆగస్టు 29న) కాన్నీ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన ఏ ఒక్కరినీ ఇబ్బందిపెట్టేవారు కాదని ఆయన కజిన్ లీసా కిట్రిల్ అన్నారు.