
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వీలుగా నీతి ఆయోగ్ కీలక సూచనలు చేసింది. చేపలు పట్టేందుకు ఉద్దేశించిన వసతులు, సామర్థ్యాల విస్తరణ (బోట్లు, పడవలు), ఆధునికీకరణకు పిలుపునిచ్చింది. తద్వారా బ్లూ ఎకానమీ (సముద్ర ఉత్పత్తులకు సంబంధించి)ని ప్రోత్సహించాలని కోరింది. చేపల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని, కీలకమైన మౌలిక వసతుల అంతరాన్ని భర్తీ చేయాలని పేర్కొంది.
పెంపకానికి ఉద్దేశించిన చేపల రకాల ఎంపిక జాగ్రత్తగా ఉండాలని, సుస్థిరమైన పెంపకం విధానాలను ప్రోత్సహించాలని సూచించింది. మన దేశానికి 11,098 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 2023–24లో చేపలు, చేపల ఉత్పత్తుల ఎగుమతుల రూపంలో ఆర్థిక వ్యవస్థకు రూ.60,523 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ చేసిన సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్‌డ్రా!