అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడిలో 57 మంది చనిపోయారు.
డమాస్కస్(సిరియా): సిరియాలో ఐసిస్‌కు పెద్ద ఎదురు దెబ్బతగిలింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరిపిన వైమానిక దాడిలో 57 మంది చనిపోయారు. ఈ సంఘటన తూర్పు సిరియా ప్రాంతంలో జరిగింది. ఐసిన్ ఆధీనంలో ఉన్న జైలుపై సంకీర్ణ దళాలు వైమానిక దాడి చేశాయి.
ఈ ఘటనలో 57 మంది చనిపోవడంతో పాటు పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో బందీ అయిన వాళ్లు కూడా ఉన్నట్లు సమాచారం.