ఖ్మేర్‌ రోజ్‌ నేతలకు జీవితఖైదు

UN War Tribunal Jails Cambodia Khmer Rouge Leaders For Life on Genocide Charges - Sakshi

ఫనోమ్‌ పెన్హ్‌: కాంబోడియాలో 1975–79 కాలంలో పోల్‌పాట్‌ నేతృత్వంలో జరిగిన ఖ్మేర్‌ రోజ్‌ సామూహిక హత్యాకాండకు సంబంధించి నాడు అధికారంలో ఉన్న ఇద్దరు కీలక నేతలకు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. నాటి ప్రధాని పోల్‌పాట్‌ నేతృత్వంలోని ఖ్మేర్‌ రోజ్‌ పార్టీ అనేక దారుణాలకు ఒడిగట్టింది. నాటి దేశ జనాభాలో దాదాపు పాతిక శాతం (20 లక్షలు) మందిని చంపేసింది. కార్మికుల చేత విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కొందరు, ఆకలికి తాళలేక మరికొందరు మరణించగా ప్రభుత్వం ఉరిశిక్షలు విధించి మరికొంత మందిని పొట్టనబెట్టుకుంది. నాడు ప్రభుత్వ దారుణాలకు సూత్రధారులుగా, కీలక పదవుల్లో ఉన్న ఖీయూ సంఫన్‌ (87)కు, నువోన్‌ చియా (92)కు ప్రస్తుతం కోర్టు శిక్షలు విధించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top