శాంతికోసం రంగంలోకి దిగుతా | UN Chief Offers to Mediate Between India, Pak to De-escalate Tension | Sakshi
Sakshi News home page

శాంతికోసం రంగంలోకి దిగుతా

Oct 1 2016 9:25 AM | Updated on Sep 4 2017 3:48 PM

శాంతికోసం రంగంలోకి దిగుతా

శాంతికోసం రంగంలోకి దిగుతా

భారత్, పాకిస్థాన్ లు సంయమనం పాటించాలని, శాంతి కోసం ముందడుగు వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ విజ్ఞప్తి చేశారు.

వాషింగ్టన్:భారత్, పాకిస్థాన్ లు సంయమనం పాటించాలని, శాంతి కోసం ముందడుగు వేయాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఇరు దేశాలతో మాట్లాడటానికి తాను సిద్దమని ప్రకటించారు. ఇటీవలి సర్జికల్ స్ట్ర్రైక్ అనంతరం ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బాన్ ఈ వ్యాఖ్యలు  చేశారు. భారత్, పాక్ లు అంగీక.రిస్తే ఇరు దేశాల ఉన్నతాధికారులతో కశ్మీర్ తో సహా అనేక విషయాలపై చర్చించడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 18 న ఉడీలోని సైనిక క్యాంపు కార్యాలయంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో 19 మంది జవాన్లు మరణించారు. మరికొంత మంది ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాడులు చేసేందుకు పొంచి ఉన్నారన్న సమాచారంతో ఇండియన్ ఆర్మీ సెప్టెంబర్ 28,29 న  'సర్జికల్ స్ట్ర్రైక్' పేరుతో దాడులు నిర్వహించి 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement