సెప్టెంబర్‌ నాటికి మూడుకోట్ల డోస్‌లు!

UK aims to roll out coronavirus vaccine for 30 million Britons by September - Sakshi

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలు ఫలించి, కరోనా వైరస్‌కు టీకా అందుబాటులోకి వస్తే.. ఈ సెప్టెంబర్‌ నాటికి 3 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను సిద్ధం చేయాలని బ్రిటన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో, ఇంపీరియల్‌ కాలేజ్‌లో ఈ టీకాకు సంబంధించిన పరిశోధనలు విజయవంతంగా సాగుతున్నాయని ఆ దేశ వాణిజ్య మంత్రి అలోక్‌ శర్మ తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌లో హ్యూమన్‌ ట్రయల్స్‌ స్థాయికి పరిశోధనలు చేరుకున్నాయన్నారు.

అయితే, పూర్తి స్థాయిలో విజయవంతమయ్యే టీకాను రూపొందించడం సాధ్యంకాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీకా రూపకల్పనకు కృషి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, పరిశోధకులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను ఇప్పటికే ఏర్పాటుచేశామన్నారు.   వం ఉన్నా లేకున్నా ప్రపం చవ్యాప్తంగా ఏ కంపెనీ అయినా బొగ్గు, ఇతర ఖనిజాల వేలంలో పాల్గొనవచ్చన్నది ప్యాకేజీలో ప్రతిపాదన. నిజానికిది తాజాగా ఆమోదించిన ఖనిజ చట్టాల సవరణ బిల్లులో ఉంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top