ప్రధాని మోదీకి ‘జాయెద్‌ మెడల్‌’

UAE awards PM Narendra Modi with highest civilian honour for boosting ties - Sakshi

దుబాయ్‌: ప్రధాని మోదీకి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) ప్రభుత్వం అత్యున్నత జాయెద్‌ పురస్కారాన్ని ప్రకటించింది. ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి విశేషంగా కృషి చేసినందుకు గుర్తింపుగా మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘భారత్‌తో మాకున్న చారిత్రక, సమగ్ర వ్యూహాత్మక సంబంధాలను మా ప్రియ స్నేహితుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయికి చేర్చారు. ఆయన కృషికి గుర్తింపుగా యూఏఈ అధ్యక్షుడు జాయెద్‌ పురస్కారాన్ని ప్రకటించారు’ అని అబూధాబీ యువరాజు, యూఏఈ సైనిక దళాల డిప్యూటీ కమాండర్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘రెండు దేశాల మధ్య ఎంతోకాలంగా ఉన్న మైత్రిని, ఉమ్మడి వ్యూహాత్మక సహకారాన్ని ఉన్నతస్థాయికి చేర్చడంలో ప్రధాని మోదీ పాత్రకు ఈ పురస్కారమే గుర్తింపు’ అని ఖలీజ్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top