నైజీరియాలో ఇద్దరు ఇంజినీర్ల కిడ్నాప్ | Two engineers kidnapped in nigeria | Sakshi
Sakshi News home page

నైజీరియాలో విశాఖ ఇంజినీర్ కిడ్నాప్

Jun 30 2016 7:12 PM | Updated on Sep 4 2017 3:49 AM

నైజీరియాలో ఇద్దరు ఇంజినీర్ల కిడ్నాప్

నైజీరియాలో ఇద్దరు ఇంజినీర్ల కిడ్నాప్

నైజీరియాలో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన ఇంజినీర్ సాయి శ్రీనివాస్గా గుర్తించారు.

నైజీరియా: నైజీరియాలో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు అపహరణకు గురయ్యారు. కిడ్నాప్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు చెందిన ఇంజినీర్ సాయి శ్రీనివాస్గా గుర్తించారు. సాయిశ్రీనివాస్‌ అపహరణతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. తన భర్తకు ఏమైందోనని భార్య లలిత....తండ్రి ఎలా ఉన్నాడో అని కుమార్తె స్పూర్తి కన్నీటిపర్యంతమౌతున్నారు. సాయిశ్రీనివాస్ జిబోకోలోని డంకోట సిమెంట్ ఫ్యాక్టరీలో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు.

కాగా గతంలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు కిడ్నాప్ కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు వారిని ఇప్పటి వరకూ వారిని విడుదల చేయలేదు. వారి రాక కోసం కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement