'ట్రంప్ అందుకే 'బ్రెగ్జిట్' నిర్ణయం మంచిదన్నారు' | Trump's Brexit remarks make him 'unfit' for President | Sakshi
Sakshi News home page

'ట్రంప్ అందుకే 'బ్రెగ్జిట్' నిర్ణయం మంచిదన్నారు'

Jun 25 2016 9:52 AM | Updated on Aug 25 2018 7:50 PM

'ట్రంప్ అందుకే 'బ్రెగ్జిట్' నిర్ణయం మంచిదన్నారు' - Sakshi

'ట్రంప్ అందుకే 'బ్రెగ్జిట్' నిర్ణయం మంచిదన్నారు'

ట్రంప్ గోల్ఫ్ బిజినెస్కు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది కాబట్టే ట్రంప్ 'బ్రెగ్జిట్' నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చారని హిల్లరీ బృందం అరోపించింది.

వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని అక్కడి ఓటర్లు ఇచ్చిన తీర్పు మంచి నిర్ణయం అని కితాబిచ్చిన ట్రంప్పై హిల్లరీ బృందం తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడు కాదన్న విషయాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయని హిల్లరీ సినియర్ పాలసీ ఆడ్వైజర్ జాక్ సుల్లివాన్ మండిపడ్డారు. పౌండ్ విలువ పతనం కావడం అనేది ట్రంప్ గోల్ఫ్ బిజినెస్కు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది కాబట్టే ట్రంప్ 'బ్రెగ్జిట్' నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చారని ఆయన విమర్శించారు.

'ట్రంప్ ఎల్లప్పుడూ ప్రపంచదేశాల మిత్రుత్వం, భాగస్వామ్యాల పట్ల అలక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాగే ఎప్పుడూ బలహీన, సురక్షితం కాని, ఆత్మవిశ్వాసం లోపించిన అమెరికా గురించి ఆయన మాట్లాడుతారు. ట్రంప్ స్వభావం అమెరికా అధ్యక్ష పదవికి పనికిరాదు' అని జాక్ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement