unfit
-
ఉత్తమ్‌కుమార్ మంత్రిగా అన్‌ఫిట్: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వట్టి దద్దమ్మ అని, ఆయనకు రైతుల బాధలు తెలియవని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌నేత జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్‌రెడ్డి అన్‌ఫిట్ అని మండిపడ్డారు. ‘కనీస అవగాహన లేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఉత్తంకుమార్ రెడ్డినే. నాగార్జునసాగర్ పరిధిలో కూడా పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుండా టైంపాస్ చేస్తున్నాడు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన నడుస్తున్నది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులే పెద్ద డెకాయిట్లు. చేయి తడపనిదే ఏ పని కావట్లేదని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు. కేసీఆర్ ని డెకాయిట్ అనెంత మొగోడీవా నువ్వు.పనిచేతగాక హెలికాప్టర్లలో తిరుగుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఉత్తమ్ సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో కూడా పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ సరైన సమయంలో బయటికి వస్తారు. వీళ్ళ బండారాన్ని బయటపెడతారు. ఇంకొన్ని రోజుల్లో రైతులే మిమ్మల్ని ఉరికించి కొడతారు’అని జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. -
చీరదరహాసం
స్పోర్ట్స్, ఎడ్వెంచర్ యాక్టివిటీలకు చీర ‘అన్‌ఫిట్’ అనే భావన ఉంది. అయితే క్రమంగా ఈ భావనలో మార్పు వస్తోంది. ‘శారీతో కూడా ఓకే’ అనిపిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్ కాత్య సైనీ చీర ధరించి కైట్ సర్ఫింగ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘నౌ దిస్ ఈజ్ క్రాస్ కల్చర్. ఐ లవ్ దిస్’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘చీర ధరించి అడ్వెంచరస్ స్పోర్ట్స్‌లో పాల్గొనడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే’ అని కొందరు హెచ్చరించారు. గత ఫిబ్రవరిలో షైను అనే యూజర్ పోస్ట్ చేసిన ఇలాంటి వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక నడి వయసు స్త్రీ చీర ధరించి రోప్ సైకిలింగ్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. వైరల్ -
మృత్యు రథాలు..!
ఆపద సమయంలో క్షణాల్లో ఆదుకునే 108, ఇంటి ముంగిటకు వెళ్లి వైద్యసేవలందించే 104 వాహనాలు ఇప్పుడు మృత్యు రథాలుగా మారాయి. ప్రభుత్వం నిధులు విదల్చకపోవడంతో నిర్వహణ భారంగామారింది. ఎక్కడ ఆగిపోతాయో తెలియదు. ఎలాంటి ప్రమాదానికి గురవుతాయో అంచనా వేయలేని పరిస్థితి. పాతవాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా.. కాలం చెల్లిన వాటినే బలవంతంగా రోడ్లపైకి వదులుతున్నారు. ఫిట్నెస్ లేదని వాటిలో పనిచేసే సిబ్బంది మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా నడిపిస్తూ నిండు ప్రాణాలు పోవడానికి కారకులవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే కుయ్.. కుయ్.. మంటూ సంఘటన స్థలానికి చేరుకునే ప్రాణప్రదాయని 108 వాహనం. రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందలాది మంది చనిపోతుంటే వారిలో సకాలంలో వైద్యం అందక చనిపోతున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉందని అధ్యయనాలనుబట్టి తెలుసుకున్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. జనం ప్రాణాలు నిలబెట్టడం కోసం 108 వాహన సేవలను అందుబాటులోకి తెచ్చారు. సేవలు విరివిగా అందించి మన్ననలు అందుకున్నారు. నేటి పాలకుల స్వార్థం కారణంగా వాహన సేవలు ఆపదలో ఉన్నవారికి దూరమవుతున్నాయి. ఇంటి ముంగిటకే వచ్చి వైద్యసేవలందించేందుకు 104ను ప్రారంభించారు. ఈ వాహనాల పరిస్థితీ అంతే. మరమ్మతులకు గురైన వాహనాలనే తిప్పుతూ ఆపదలో ఉన్నవారిని.. అందులో పనిచేసే సిబ్బంది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. ఫిట్నెస్ లేకుండానే... బలిజిపేట మండలం మిర్తివలస గ్రామ సమీపంలోని శివాలయం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 104 వాహనం డ్రైవర్ మహేష్‌తో పాటు, ఎనిమిది నెలల నిండు గర్భిణిగా ఉన్న స్టాఫ్‌నర్స్ నెమలి సంతోషికుమారి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అదే 104 వాహనంలో వారిరువురూ ఎంతో మందికి ప్రాణం పోసి ఉంటారు. గర్భిణులను సకాలంలో ఆస్పత్రికి చేర్చి మాతృమూర్తుల దీవెనలందుకున్నారు. వారి వరకూ వచ్చే సరికి అదే వాహనం మృత్యురథమైంది. కనికరం లేని విధి కాటు వేసిందని తప్పించుకుంటే అది కచ్ఛితంగా పాపమే అవుతుంది. ఎందుకంటే.. ఈ రెండు నిండు జీవితాలను బలితీసుకుంది కేవలం పాలకుల నిర్లక్ష్యం. కొందరి స్వార్థం. దానికి నిదర్శనం జిల్లాలోని çపదిహేడు 104 వాహనాలు, ఇరవై ఎనిమిది 108 వాహనాలకు పాతబడిపోయినా, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా వాటినే నడుపుతున్నారు. ప్రాధాన్యం ఉన్నా... చంద్రన్న సంచార చికిత్స (104) వాహనాలను సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచుతుంటారు. వాహనం గ్రామానికి వెళ్లినప్పుడు అందులో స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్టు, డ్రైవర్, ఏఎన్ఎం, సంబంధిత పీహెచ్సీ వైద్యుడు, ల్యాబ్‌టెక్నీషియన్ వెళ్తారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. ఇంతటి ప్రాధాన్యంగల వాహనాల పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. ఏ వాహనం అయినా ఫిట్నెస్ సర్టిఫికేట్ (ఎఫ్‌సీ), బీమా (ఇన్సూరెన్స్), రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) ఉంటేనే రోడ్డుపై తిప్పాలి. కానీ, చంద్రన్న సంచార వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేకపోయినా రోడ్డుపై తిప్పేస్తున్నారు. అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారంటూ 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌కు గత నెల 23నే ఫిర్యాదు చేశారు. వారెవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారేగనుక అప్పుడే స్పందించి ఉంటే ఇప్పుడు ఈ రెండు ప్రాణాలతో పాటు భూమిమీదకు రాకుండానే పసిగుడ్డు చితికిపోయేది కాదు. అవును.. ఫిట్నెస్ లేదు.. జిల్లాలో ఉన్న 104 (చంద్రన్న సంచార చికిత్స) వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ లేని మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. –బి.సూర్యారావు, 104 సేవల మేనేజర్, విజయనగరం -
ప్రాణాలతో చెలగాటమా?
బొబ్బిలి : ప్రభుత్వానితో ఒప్పందం కుదుర్చుకుని బీమా ప్రీమియంలు చెల్లించకుండా.. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా ఉన్న వాహనాలిచ్చి మా ప్రాణాలు తీస్తారా? ఇదెక్కడి అన్యాయం.. మా ప్రాణాలకు విలువ లేదా? మీరు చనిపోతే మే ము రూ.50 లక్షలిస్తాం అంగీకరిస్తారా? వియ్ వాంట్ జస్టిస్.. అంటూ 104 వాహన సిబ్బంది, రాష్ట్ర స్థాయి నాయకులు నినదించారు. బొబ్బిలి ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోయిన ప్రాణాలకు పరిహారమివ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఉద్యోగులపై పాలకులు, యాజ మాన్యం తీరును దుయ్యబట్టారు. బలిజిపేట మండలం మిర్తివలస వద్ద 104 వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వాహనం డ్రైవర్ పిల్లా మోహనరావు, స్టాఫ్ నర్సు నెమలి సంతో షికుమారిలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తెలుసుకున్న 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు, సీఐటీయూ, సీపీఎం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆది వారం ఆందోళన చేశారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకెళ్లబోమంటూ డ్రైవర్ భార్య శిల్లా దమయంతి, స్టాఫ్‌నర్సు భర్త గౌరీ ప్రసాద్‌లతో పాటు 104 ఉద్యోగులంతా బైఠాయించా రు. 104 వాహనాల కాంట్రాక్టర్, ఏజెన్సీ ప్రతి నిధులు వచ్చి న్యాయం చేసేవరకూ కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న 104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం, మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర నాయకులు పలివెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశముందని, మీరిచ్చిన వాహనాలకు ఫిట్నెస్ లేదని ఎన్నోమార్లు ప్రభుత్వానికి నివేదించామన్నారు. అయినా పట్టించుకోలేదన్నారు. సీఎం చంద్రబాబుకు సైతం వినతిపత్రం అందజేశామన్నారు. అన్నీ ఉన్నాయని బుకాయించారు.. రాష్ట్ర స్థాయిలో ఉన్న 104 వాహనాలకు ఎటువంటి అనుమతులు లేవని చెప్పినా ఆ ఏజెన్సీ తిరిగి మాకు అన్ని అనుమతులూ ఉన్నాయని లేఖ రాసిందనీ అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని 104 ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. అంబేడ్కర్ జయంతి రోజున ముఖ్యమంత్రి పలు ప్రసంగాలు చేశారని, ఇప్పుడు చనిపోయింది దళితులేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంటే సీఎంకు చులకనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం కోసం చర్చలు.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంపై 104 సేవల ఏజెన్సీ ప్రతినిధి బేరమాడుతూ వచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీఆర్ ఫణికుమార్, కోశాధికారి నాయుడు, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు త్రిమూర్తులు, బాలరాజులతో పాటు స్థానిక సీపీఎం, సీటీయూ నాయకులు టీవీ రమణ, రెడ్డి వేణు, పొట్నూరు శంకరరావులు ఆస్పత్రివద్దనే ఉన్నారు. వీరితో పాటు డీఎస్పీ పి.సౌమ్యలత, ఆర్డీఓ సుదర్శన దొర, సీఐ మోహనరావు, ప్రసాదరావులతో పాటు బేబీనాయన, పార్వతీపురం ఎమ్మెల్యే బి.చిరంజీవులు, మున్సిపల్ చైర్పర్సన్ అచ్యుతవల్లిలు పరిహారం గూర్చి యాజమాన్య ప్రతినిధులతో మాట్లాడారు. చివరకు డీఎం హెచ్ఓ వచ్చి రూ.10 లక్షలకు అంగీకరించేలా చేశారు. దీంతో పాటు మృతుల కుటుంబంలో ఒకరికి అవుట్‌సోర్సింగ్‌లో ఉద్యో గం, చంద్రన్న బీమా, 104 ఉద్యోగుల తరఫున బీమా, ఆర్టీసీ సంస్థ తరపున బీమా వచ్చే అవకాశం ఉండటంతో ఉద్యోగుల సంఘ నాయకులు అంగీకరించారు. ఈ పరిహారం ఇచ్చేందుకు రాతపూర్వకంగా ఉండాలని, ఎప్పుడిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేయడంతో రెండు వారాల్లోగా ఇస్తామని చెప్పిన యాజమాన్య ప్రతినిధి అక్కడి నాయకులు, అధికారుల ఒత్తిడితో ఎట్టకేలకు అంగీకరించారు. తక్షణ సాయం అందజేత... ప్రమాదంలో మృతి చెందిన వాహన డ్రైవర్ పిల్లా మోహనరావు, స్టాఫ్ నర్స్ నెమలి సంతోషి కుమారి కుటుంబాలకు రూ.50వేల చొప్పున కలెక్టర్ జారీ చేసిన తక్షణ సాయాన్ని ఆర్డీఓ బి. సుదర్శనదొర, ఎమ్మెల్యే బి చిరంజీవులు, బేబీ నాయన, ఎమ్మెల్సీ జగదీష్‌లు అందజేశారు. బాసటగా నిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ సీపీ పార్వతీపురం నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. ఆస్పత్రికి చేరుకుని మృతులకు బాసటగా నిలిచారు. దుర్ఘటన తీరు, పరిహారం విషయంలో యాజమాన్యం అవలంభిస్తున్న వైఖరిని దుయ్యబట్టారు. బొబ్బిలి వైఎస్సార్ సీపీ నాయకులు ఇంటి గోపాలరావు సైతం ఆస్పత్రికి చేరుకుని సిబ్బంది కుటుంబాలకు న్యాయం చేయాలని, 104 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. -
ఇంజనీర్లు కాదు ఇంజన్లో నీళ్లు..!
-
'ట్రంప్ అందుకే 'బ్రెగ్జిట్' నిర్ణయం మంచిదన్నారు'
వాషింగ్టన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని అక్కడి ఓటర్లు ఇచ్చిన తీర్పు మంచి నిర్ణయం అని కితాబిచ్చిన ట్రంప్‌పై హిల్లరీ బృందం తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడు కాదన్న విషయాన్ని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయని హిల్లరీ సినియర్ పాలసీ ఆడ్వైజర్ జాక్ సుల్లివాన్ మండిపడ్డారు. పౌండ్ విలువ పతనం కావడం అనేది ట్రంప్ గోల్ఫ్ బిజినెస్‌కు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది కాబట్టే ట్రంప్ 'బ్రెగ్జిట్' నిర్ణయాన్ని వెనుకేసుకొచ్చారని ఆయన విమర్శించారు. 'ట్రంప్ ఎల్లప్పుడూ ప్రపంచదేశాల మిత్రుత్వం, భాగస్వామ్యాల పట్ల అలక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అలాగే ఎప్పుడూ బలహీన, సురక్షితం కాని, ఆత్మవిశ్వాసం లోపించిన అమెరికా గురించి ఆయన మాట్లాడుతారు. ట్రంప్ స్వభావం అమెరికా అధ్యక్ష పదవికి పనికిరాదు' అని జాక్ విమర్శించారు.