హేలీని ఈజీగా పీకేస్తానంటూ ట్రంప్‌ జోక్‌ | Trump Jokes About Firing Haley | Sakshi
Sakshi News home page

హేలీని ఈజీగా పీకేస్తానంటూ ట్రంప్‌ జోక్‌

Apr 25 2017 8:59 AM | Updated on Aug 25 2018 7:52 PM

హేలీని ఈజీగా పీకేస్తానంటూ ట్రంప్‌ జోక్‌ - Sakshi

హేలీని ఈజీగా పీకేస్తానంటూ ట్రంప్‌ జోక్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రాయబారులందరినీ తెగనవ్వించారు. తాను నిర్దేశించిన లక్ష్యాలను గురించి మాట్లాడుతూనే అందులో సున్నిత హాస్యం చేర్చి అందరికీ కొత్తగా దిశా నిర్దేశం చేశారు.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తన రాయబారులందరినీ తెగనవ్వించారు. తాను నిర్దేశించిన లక్ష్యాలను గురించి మాట్లాడుతూనే అందులో సున్నిత హాస్యం చేర్చి అందరికీ కొత్తగా దిశా నిర్దేశం చేశారు. అమెరికా తరుపున ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వంగల దేశాలకు విదేశీ రాయబారులుగా పనిచేస్తున్న వారితో ప్రత్యేక సమావేశం అయ్యారు. వైట్‌ హౌస్‌లో వారికి లంచ్‌ ఏర్పాటుచేసిన అనంతరం మాట్లాడారు.

ముఖ్యంగా పలువురు రాయబారులు ఉన్నప్పటికీ.. నిక్కీ హేలీని ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. విదేశాంగ విధానం విషయంలో ఆమె చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ‘ఆమె తన విధిని చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు. ఎవరైనా నిక్కీలాగా ఇప్పుడు ఎవరైనా చేస్తారా? ఒక వేళ ఆమెలాగా ఎవరు చేయకపోయినా, ఆమెనే చేయకపోయినా తేలికగా ఆమెను భర్తీ చేయొచ్చు’ అంటూ తెగ నవ్వించారు. అయితే, అలా ఎప్పటికీ తాము చేయబోమని, ఆమె నిజానికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement