అఫ్గాన్‌లో పేలుడు.. ఐదుగురు మృతి | Truck Bomb In Afghanistan Gardez City Kills Five | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌లో పేలుడు.. ఐదుగురు మృతి

May 14 2020 6:16 PM | Updated on May 14 2020 6:25 PM

Truck Bomb In Afghanistan Gardez City Kills Five - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కాబుల్‌ : అఫ్గానిస్తాన్‌ తూర్పు భాగంలోని గార్డెజ్‌ సిటీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, 14 మంది గాయపడ్డారు. గార్డెజ్‌ సిటీలోని ఓ కోర్టు సమీపంలో పార్క్‌ చేసి ఉన్న పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్నచోటును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడి వెనక తాలిబన్ల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి : ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్‌)

అయితే ఈ దాడికి రెండు రోజుల ముందే అఫ్గాన్‌లో జరిగిన రెండు వెర్వేరు ఉగ్రదాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కాబుల్‌లోని మెటర్నరీ ఆస్పత్రిలో జరిగిన కాల్పుల్లో 24 మంది మృతిచెందారు. అదే రోజు తూర్పు నాన్‌గాహార్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో 32 మంది మరణించారు. ఈ ఆత్మహుతి దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది. అఫ్గాన్‌లో జరుగుతున్న వరుస దాడులను ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తీవ్రంగా ఖండించారు. మిలటరీ ఎదురుదాడి విధానాన్ని అవలంబించాలని ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement