జర్మనీలో రైళ్లు ఢీ.. పది మంది మృతి | Train Crash in Germany, 4 dead, 150 Injured | Sakshi
Sakshi News home page

జర్మనీలో రైళ్లు ఢీ.. పది మంది మృతి

Feb 10 2016 4:09 AM | Updated on Sep 3 2017 5:17 PM

జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో మంగళవారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో పది మంది ప్రయాణికులు మరణించగా సుమారు 150 మంది గాయపడ్డారు.

బాడ్ ఐబ్లింగ్: జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో మంగళవారం రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న దుర్ఘటనలో పది మంది ప్రయాణికులు మరణించగా సుమారు 150 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బవేరియాలోని బాడ్ ఐబ్లింగ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి ఓవైపు అడవి మరోవైపు నది ఉండటంతో సహాయ సిబ్బంది బోట్లు, హెలికాప్టర్లలో అక్కడకు చేరుకోవాల్సి వచ్చింది. ప్రమాద కారణాలతోపాటు ఆ సమయంలో రైళ్ల వేగం ఎంతో వెంటనే తెలియరాలేదు. అయితే గంటకు 120 కి.మీ. వేగంతో ప్రయాణిం చేందుకు రైళ్లకు అనుమతి ఉన్నట్లు అధికారులు చెప్పారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement