
వాషింగ్టన్ : అమెరికాలోని దోపిడీ దొంగల కాల్పుల్లో హైదరాబాద్ వాసికి గాయాలు అయ్యాయి. టోలిచౌకీకి చెందిన సయ్యద్ బాఖర్ హుస్సేన్ దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రస్తుతం అమెరికాలోని సౌత్ సుబర్బన్ డాల్టన్ క్రిస్ట్ ఆస్పత్రిలో చేర్చించారు.
ఆయన పరిస్థితి కొంత ప్రమాదకరంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. షికాగోలోని డాల్టన్‌లో క్లార్క్ స్టోర్, గ్యాస్ స్టేషన్‌లోకి దొంగలు చొరబడ్డారు. దోపిడికి యత్నించే క్రమంలో కాల్పులు జరపడంతో అర్షద్ వోహ్రా(19) అనే గుజరాత్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోగా సయ్యద్ బాఖర్ హుస్సేన్ మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. అర్షద్ వోహ్రా కుటుంబ సభ్యులు ఈయనకు బంధువులు. కాగా, కాల్పుల్లో తీవ్రంగా గాయపడి బాఖర్ చికిత్స పొందుతున్నారని తెలిపిన ఆయన కుటుంబ సభ్యులు తమకు తెలంగాణ ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.