మూడవ మృతదేహం స్వాధీనం | Three dead in St-Denis raid, woman's body found | Sakshi
Sakshi News home page

మూడవ మృతదేహం స్వాధీనం

Nov 20 2015 4:21 PM | Updated on Sep 3 2017 12:46 PM

మూడవ మృతదేహం స్వాధీనం

మూడవ మృతదేహం స్వాధీనం

పారిస్ ఉగ్రదాడి ఘటనలో మూడవ ఉగ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పారిస్ :  పారిస్ ఉగ్రదాడి ఘటనలో మూడవ ఉగ్రవాది మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  తీవ్ర అలజడి రేపిన ఈ కాల్పులకు ఘటనకు పాల్పడిన  మహిళా జిహాదీ మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు.  బుధవారం సెయింట్ డేనిస్ అపార్ట్ మెంట్ పై జరిగిన దాడిలో కీలకమైన ఉగ్రవాది హతమైన ప్రదేశంలో ఈ  మూడో మృతదేహాన్ని కనుగొన్నామని  విచారణ అధికారులు ప్రకటించారు. 

 

అయితే  ఆ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు. సంఘటనా స్థలంలో హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా కీలక సూత్రధారితోపాటు చనిపోయిన మహిళా ఉగ్రవాది.. అతడి (కజిన్) బంధువేనని, ఆమె పేరు హస్నా ఐతబౌలాచ్న్ అని పోలీసు వర్గాలు తెలిపాయి.  సంఘటనా స్థలంలో దొరికిన పాస్ పోర్ట్ ఆ మహిళ  పేరుతో ఉండటం ఈ అనుమానాలకు  తావిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement