వెంట్రుక కన్నా పదివేల రెట్లు పలుచనైన ఎక్స్ రే! | The World's Sharpest X-Ray Beam Shines at DESY | Sakshi
Sakshi News home page

వెంట్రుక కన్నా పదివేల రెట్లు పలుచనైన ఎక్స్ రే!

Oct 2 2013 5:48 AM | Updated on Sep 1 2017 11:17 PM

మనిషి శరీరంలో ఎముకలతోపాటు అనేక పదార్థాల నిర్మాణాన్ని చిత్రాల రూపంలోకి మలచేందుకు ఉపయోగించే ఎక్స్ రేల్లో అత్యంత పలుచనైన కిరణాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ గోటిన్‌జెన్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు.

బెర్లిన్‌: మనిషి శరీరంలో ఎముకలతోపాటు అనేక పదార్థాల నిర్మాణాన్ని చిత్రాల రూపంలోకి మలచేందుకు ఉపయోగించే ఎక్స్ రేల్లో అత్యంత పలుచనైన కిరణాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ గోటిన్‌జెన్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు. ప్రపంచంలోనే అతి పలుచనైన ఈ ఎక్స్ కిరణం మనిషి వెంట్రుక కన్నా 10 వేల రెట్లు పలుచగా ఉండటం విశేషం.ప్రస్తుత పద్ధతుల్లో సృష్టిస్తున్న ఎక్స్  కిరణాలు కనీసం 20 నానోమీటర్ల మందంలో ఉంటున్నాయని, తాము మాత్రం 5 నానోమీటర్ల వ్యాసంలోనే ఎక్స్ కిరణాన్ని సృష్టించగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్‌ చెప్పారు. సోలార్‌ సెల్స్ లో ఉపయోగించే నానోస్థాయి తీగలపై, రసాయన పదార్థాల్లో అతిసూక్ష్మ స్థాయి విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement