ద బెస్ట్‌ బాస్‌ ఇన్‌ ద బాల్కన్స్‌ | The best boss in the Balkans | Sakshi
Sakshi News home page

ద బెస్ట్‌ బాస్‌ ఇన్‌ ద బాల్కన్స్‌

Jun 18 2017 1:09 AM | Updated on Sep 5 2017 1:52 PM

ద బెస్ట్‌ బాస్‌ ఇన్‌ ద బాల్కన్స్‌

ద బెస్ట్‌ బాస్‌ ఇన్‌ ద బాల్కన్స్‌

రాడొమిర్‌ నోవాకోవిక్‌ కకా.. మాంటెనీగ్రోకు చెందిన ఈయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త.

రాడొమిర్‌ నోవాకోవిక్‌ కకా.. మాంటెనీగ్రోకు చెందిన ఈయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఇతని ఉద్యోగులు నోవాకోవిక్‌ను ముద్దుగా ‘ద బెస్ట్‌ బాస్‌ ఇన్‌ ద బాల్కన్స్‌’, ‘బ్రదర్‌’ అని పిలుచుకుంటారు. కకాన్‌ స్పోర్ట్స్‌ అనే అతి పెద్ద క్రీడా వస్తువుల స్టోర్స్‌ యజమాని ఈ నోవాకోవిక్‌. ఇటీవలే ఆయన రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేశారు. కొన్ని ఏళ్లుగా బాల్కన్స్‌ దేశాల్లో ఈయన పేరు మారుమోగుతోంది. వ్యాపారంలో విపరీతంగా లాభాలు ఆర్జించడం వల్ల ఈయన పేరు ప్రఖ్యాతులు గడించలేదు కానీ తన కంపెనీలో నిజాయితీగా కష్టించి పనిచేసే ఉద్యోగులపై ఆయన చూపే ఔదార్యంతో ఎంతో ఫేమస్‌ అయిపోయారు. ఉద్యోగులను సంతోషంగా ఉంచితేనే తన కంపెనీ లాభాల బాట పడుతోందనే మాటను ఆయన గట్టిగా నమ్ముతారు. తన ఉద్యోగులకు బహుమతులను అందజేస్తారు.

2012లో తొలిసారిగా తన కంపెనీలో పనిచేసే నలుగురికి 4 బ్రాండెడ్‌ కార్లను బహూకరించారు. 2014లో తన కంపెనీలో ఒక ఉద్యోగికి సాకర్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూడాలనుందని తెలియగానే అతని కోసం ఒక టికెట్‌ కొనిచ్చారు. రెండేళ్ల క్రితం 14 మంది ఉద్యోగులను బహమాస్, సిచెల్లెస్‌ ద్వీపాలకు వెకేషన్‌కు పంపించారు. మరోసారి మరికొంతమంది ఉద్యోగులను విలాసవంతమైన సముద్రయాత్రకు పంపించారు. బోనస్‌లు, జీతాలు పెంచి వారిని సంతృప్తి పరిస్తే సరిపోతుంది కదా అని  నోవాకోవిక్‌ను చాలా మంది ప్రశ్నించగా ‘డబ్బులు వస్తాయి.. పోతాయి.. కానీ జ్ఞాపకాలు చిరకాలం నిలిచిపోతాయి’ అని బదులిస్తాడు. నోవాకోవిక్‌ తమ పట్ల చూపే ప్రేమకు ఉద్యోగులు కూడా మెచ్చి ఎంతో నిజాయితీగా పనిచేస్తారు. ఆయన కంపెనీ స్టోర్లలో పనిచేసే ఒక్క ఉద్యోగి కూడా ఆలస్యంగా విధులకు రాడంటే నమ్మగలమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement