 
													కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని శంషాద్ టీవీ చానెల్ కార్యాలయం లోకి పోలీసు దుస్తుల్లో ప్రవేశించిన దుండగులు తుపాకీతో విచక్షణార హితంగా కాల్పులకు తెగబడ్డారు.  ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు మరణిం చగా.. 24 మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న అఫ్గాన్ ప్రత్యేక దళ పోలీసులు కార్యాలయ భవనం గోడకు ఓవైపు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని హతమార్చారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించుకుంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
