అమెరికాలో ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు అతడిని ప్రయత్నిస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.
వాషింగ్టన్: అమెరికాలో ఓ పద్దెనిమిదేళ్ల యువకుడిని ఎఫ్బీఐ అరెస్టు చేసింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్లో చేరేందుకు అతడిని ప్రయత్నిస్తున్న క్రమంలో అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. అక్రమ్ ముస్లే అనే యువకుడు ఇస్లామిక్ స్టేట్ ప్రేరిత సాహిత్యం, ఇతర వస్తువులతో ఇండియానా పోలిస్ నుంచి న్యూయార్క్కు ఓ బస్సులో బయలు దేరాడు.
ఇతడిని అనుమానించిన పోలీసులు తనిఖీలు చేయగా అతడు మొరాకో ద్వారా ఇస్లామిక్ స్టేట్ ప్రభావిత ప్రాంతంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇస్లామిక్ స్టేట్కు మద్దతిచ్చేలా ఉన్న మెటీరియల్తో వెళుతుండగా అతడిని పథకం ప్రకారం అరెస్టు చేశారు. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. దాదాపు రెండు లక్షల యాభైవేల డాలర్ల ఫైన్ కూడా పడనుంది.