బుడుగుల కోసం సూపర్ కారు.. | Super car for budugula .. | Sakshi
Sakshi News home page

బుడుగుల కోసం సూపర్ కారు..

Jan 5 2015 7:46 AM | Updated on Sep 2 2017 7:15 PM

బుడుగుల కోసం సూపర్ కారు..

బుడుగుల కోసం సూపర్ కారు..

పిల్లల కోసం రూపొందించిన లేటెస్ట్ సూపర్ ఎలక్ట్రిక్ కారు ఇది. పేరు ‘బ్రూన్ ఎఫ్8’.

పిల్లల కోసం రూపొందించిన లేటెస్ట్ సూపర్ ఎలక్ట్రిక్ కారు ఇది. పేరు ‘బ్రూన్ ఎఫ్8’. కొరియన్ కంపెనీ తయారుచేసిన ఈ కారు మూడు రకాల డ్రైవింగ్ మోడ్‌లలో నడుస్తుంది. ఆండ్రాయిడ్ టాబ్లెట్‌తో సైతం దీనిని నియంత్రించొచ్చు. కుదుపులు నివారించేందుకు నాలుగు చక్రాలకూ గ్యాస్ సస్పెన్షన్ సిస్టమ్, స్మార్ట్ టచ్‌స్క్రీన్ పవర్ కంట్రోల్, పిల్లల భద్రత కోసం బకెట్ సీట్లు, ఎలక్ట్రానిక్ డిస్క్ బ్రేకుల వంటి ప్రత్యేకతలూ ఉన్నాయి. బ్లూటూత్ రిమోట్ కంట్రోల్‌తో పెద్దవారు కూడా దీనిని బయటి నుంచి నియంత్రించే అవకాశమూ ఉంటుంది. గరిష్టంగా గంటకు 14 కి.మీ. వేగంతో పరుగెత్తే ఈ కారు పిల్లలకు అద్భుతమైన కానుక అని దీని రూపకర్తలు చెబుతున్నారు. అన్నట్టూ.. దీని ఖరీదెంతో తెలుసా..? జస్ట్ వెయ్యి డాలర్లు.. అంటే రూ. 63 వేలే!
 

Advertisement
 
Advertisement
Advertisement