
కొలంబో: పడవలో అక్రమంగా ఆస్ట్రేలియాకు వలసవెళ్తున్న 22మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. తమకందిన సమాచారం మేరకు పుట్టలం కోస్టల్ టౌన్ వద్దవారందరినీ ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి రువాన్ గుణశేఖర తెలిపారు. అరెస్టు చేసినవారిని కోర్టులో హాజరుపరిచామన్నారు.
అయితే శ్రీలంకేయులు, ఇరానియన్లు, ఆఫ్గన్లు రెండువేల మందికిపైగా పసిఫిక్ ఐలాండ్స్‌లోని నౌరు, పపువా న్యూగినియా ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మనుషుల అక్రమ రవాణా జరగకుండా ఆస్ట్రేలియా, శ్రీలంక పరస్పరం సహకరించుకుంటున్నాయి. శ్రీలంకలో ఆశ్రయం పొందినవారెవరూ ఆస్ట్రేలియాకు పడవల్లో వెళ్లకుండా 2013నుంచి నిషేధం ఉంది.