స్పెల్ బీ విజేతలు.. శ్రీరామ్, సుజోయ్ | Spell Bee winners are Sriram, Sujoy | Sakshi
Sakshi News home page

స్పెల్ బీ విజేతలు.. శ్రీరామ్, సుజోయ్

May 31 2014 2:15 AM | Updated on Oct 17 2018 4:36 PM

స్పెల్ బీ విజేతలు.. శ్రీరామ్, సుజోయ్ - Sakshi

స్పెల్ బీ విజేతలు.. శ్రీరామ్, సుజోయ్

ప్రతిష్టాత్మక స్పెల్ బీ చాంపియన్‌షిప్‌లో మరోసారి భారత సంతతి విద్యార్థులు సత్తా చాటారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్ బీ కాంటెస్ట్‌లో న్యూయార్క్‌కు చెందిన శ్రీరామ్ హత్వర్ (14), టెక్సాస్‌కు చెందిన అన్‌సన్ సుజోయ్ (13) సంయుక్త విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు.

 వాషింగ్టన్: ప్రతిష్టాత్మక స్పెల్ బీ చాంపియన్‌షిప్‌లో మరోసారి భారత సంతతి విద్యార్థులు సత్తా చాటారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్ బీ కాంటెస్ట్‌లో న్యూయార్క్‌కు చెందిన శ్రీరామ్ హత్వర్ (14), టెక్సాస్‌కు చెందిన అన్‌సన్ సుజోయ్ (13) సంయుక్త విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. స్పెల్ బీ పోటీల చరిత్రలో ఇలా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలవడం ఇది నాలుగోసారి మాత్రమే. 1962లో చివరిసారిగా ఇద్దరు సంయుక్త విజేతలుగా నిలిస్తే.. మళ్లీ 52 ఏళ్ల తర్వాత ఇప్పుడు శ్రీరామ్, సుజోయ్ ఆ ఘనత సాధించారు. గురువారం రాత్రి జరిగిన స్పెల్ బీ ఫైనల్ రౌండ్‌లో 25 పదాలకుగానూ వీరిద్దరూ 12 పదాలను సరిగ్గా చెప్పి టైటిల్‌తో పాటు 30 వేల డాలర్ల స్కాలర్‌షిప్ కూడా దక్కించుకున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌కు చెందిన సుజోయ్ సెవెన్త్ గ్రేడ్ చదువుతున్నాడు. న్యూయార్క్‌కు చెందిన శ్రీరామ్ ఇప్పటికే నాలుగు సార్లు ఈ పోటీల్లో పాల్గొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement