సోమాలియా రాజధానిలో ఆత్మాహుతి దాడి | Somali capital Mogadishu hit by double explosions at hotel | Sakshi
Sakshi News home page

సోమాలియా రాజధానిలో ఆత్మాహుతి దాడి

Feb 21 2015 10:46 AM | Updated on Sep 2 2017 9:41 PM

సోమాలియా రాజధాని మొగదిషులో ఇస్లామిక్ తీవ్రవాదులు రెండు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు.

మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఇస్లామిక్  తీవ్రవాదులు రెండు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు.   ఈదాడిలో నగర డిప్యూటీ మేయర్, ఒక ఎంపీతో సహా 20మంది పౌరులు మరణించారు.  ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినదాడి అని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాజకీయ నాయకులు ఎక్కువ గా బస చేసే నగరంలోని సెంట్రల్ హోటల్ ను టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు,   ముందు గేటుదగ్గర బాంబు పేల్చి భయోత్పాతం సృష్టించారు. ఆ తర్వాత హోటల్   ఆవరణలో  తమను తాము  పేల్చేసుకున్నారు.   అనంతరం సమీపంలోని మసీదును ముట్టడించి ప్రార్థన చేసుకుంటున్నవారిపై కాల్పులు జరిపారు.
రాజధాని నగరం నడిబొడ్డున జరిగిన ఈ దాడి  వెనుక అల్ ఖైదాతో  సంబంధమున్న అల్ షబాబ్  తీవ్రవాద  సంస్థ   హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడినుంచి అల్ షబీబ్ తీవ్రవాద  గ్రూపును  తరిమివేసినట్టుగా చెబుతున్నన్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో తన పట్టును కొనసాగిస్తోంది.  
అయితే ఇదే హోటల్ లో వున్న సోమాలియా ఉపప్రధాని, మరికొందరు మంత్రులు  తృటిలో తప్పించుకున్నట్టు   ఆ దేశ సమాచార మంత్రి  మహ్మద్ అబి హాయిర్ మారియే  తెలిపారు.
వారంతా  ఇస్లాం మతద్రోహులు.అందుకే వారిని అంతమొందించామని అల్ షబీబ్ ప్రతినిధి  వ్యాఖ్యానించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement