breaking news
Somalia hotel
-
సోమాలియా రాజధానిలో ఆత్మాహుతి దాడి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఇస్లామిక్ తీవ్రవాదులు రెండు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈదాడిలో నగర డిప్యూటీ మేయర్, ఒక ఎంపీతో సహా 20మంది పౌరులు మరణించారు. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగినదాడి అని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. రాజకీయ నాయకులు ఎక్కువ గా బస చేసే నగరంలోని సెంట్రల్ హోటల్ ను టార్గెట్ చేసుకున్న తీవ్రవాదులు, ముందు గేటుదగ్గర బాంబు పేల్చి భయోత్పాతం సృష్టించారు. ఆ తర్వాత హోటల్ ఆవరణలో తమను తాము పేల్చేసుకున్నారు. అనంతరం సమీపంలోని మసీదును ముట్టడించి ప్రార్థన చేసుకుంటున్నవారిపై కాల్పులు జరిపారు. రాజధాని నగరం నడిబొడ్డున జరిగిన ఈ దాడి వెనుక అల్ ఖైదాతో సంబంధమున్న అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడినుంచి అల్ షబీబ్ తీవ్రవాద గ్రూపును తరిమివేసినట్టుగా చెబుతున్నన్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో తన పట్టును కొనసాగిస్తోంది. అయితే ఇదే హోటల్ లో వున్న సోమాలియా ఉపప్రధాని, మరికొందరు మంత్రులు తృటిలో తప్పించుకున్నట్టు ఆ దేశ సమాచార మంత్రి మహ్మద్ అబి హాయిర్ మారియే తెలిపారు. వారంతా ఇస్లాం మతద్రోహులు.అందుకే వారిని అంతమొందించామని అల్ షబీబ్ ప్రతినిధి వ్యాఖ్యానించినట్టు సమాచారం. -
తీవ్రవాదుల ఆత్మాహుతి దాడి: 11 మంది మృతి
సోమాలియా రాజధాని మొగదీషులో అల్ ఖైదా తీవ్రవాద అనుబంధ సంస్థ ఆల్ షబాబ్ చెందిన తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఆ దాడులలో 11 మంది చనిపోయారు. వారిలో నలుగురు భద్రత సిబ్బంది కూడా ఉన్నారు. మొగదీషు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ప్రముఖ జజీరా హోటల్ వద్ద తీవ్రవాదులు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. స్థానికులు, భద్రత సిబ్బంది వెంటనే స్పందించి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అయితే కొన్ని నిముషాల తేడాతో ఆ ప్రదేశానికి అతి సమీపంలో మరో కారు పేలింది. దాంతో మృతుల సంఖ్య 11కు పెరిగింది. అయితే మొగదీషులోని జజీరా హోటల్‌కు తరచుగా స్థానిక రాజకీయ నాయకులు, విదేశీయులు తరచుగా వస్తుంటారు. వారిని లక్ష్యంగానే ఆ దాడులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ దాడిని సోమాలియా ప్రధానమంత్రి ఖండించారు. 2014 ఆరంభంలో కూడా తీవ్రవాదులు విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ ఆత్మాహుతి దాడి బుధవారం చేసుకుంది.