పాముతో షి'కారు'.. వైరల్ వీడియో | Snake journey on Moving Car in Georgia | Sakshi
Sakshi News home page

పాముతో షి'కారు'.. వైరల్ వీడియో

Jun 11 2017 11:48 AM | Updated on Sep 5 2017 1:22 PM

పాముతో షి'కారు'.. వైరల్ వీడియో

పాముతో షి'కారు'.. వైరల్ వీడియో

కొన్నిసార్లు మనకు అనుకోని అతిథులు ఎదురవుతుంటాయి. కొన్ని మనల్ని భయపెట్టేవయితే, మరిన్ని మనకు ఆనందాన్ని పంచేవి. ఒక్కోసారి వాటి చర్యలతో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అమెరికా: కొన్నిసార్లు మనకు అనుకోని అతిథులు ఎదురవుతుంటాయి. కొన్ని మనల్ని భయపెట్టేవయితే, మరిన్ని మనకు ఆనందాన్ని పంచేవి. ఒక్కోసారి వాటి చర్యలతో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పాముతో కారు షికారు అంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలివి.. ఓ పార్కింగ్ ప్లేస్‌లో కారును ఆపి వాహన యజమాని(డ్రైవర్) ర్యాన్ మెక్ మార్ఫీ తన పని ముగించుకున్నాడు. ఆపై కారును తీయబోతే దాని బానెట్‌పై దాదాపు 10 అడుగుల పాము ఉంది.

పాముకి కారు షికారు చేయాలని అనిపించి ఉంటుందనుకుని కారు డ్రైవర్ మెక్ మార్ఫీ పాము కదలికలను వీడియో తీయడం మొదలుపెట్టాడు. కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా బానెట్‌పై ఉన్న ఆ పాము అటూ ఇటూ కదిలింది. బానెట్ నుంచి పాకుతూ కారు విండో వద్దకు వచ్చి.. తలతో కొట్టింది. పాము వల్ల ఎప్పటికైనా అపాయమని భావించిన మెక్ మార్ఫీ భయపడి.. కారును హైవేపై మధ్యలోనే నిలిపివేశాడు. ఆ వెంటనే పాము మెల్లగా కారు దిగి తన దారిన అది వెళ్లిపోయింది. పాముతో తన హర్రర్ జర్నీని వివరిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. కొందరు తమ ఫేస్‌బుక్ ఖాతాలో వీడియో షేర్ చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement