బుల్లెట్ నుంచి ప్రాణాలను కాపాడిన స్మార్ట్ఫోన్ | Smartphone takes bullet, saves life | Sakshi
Sakshi News home page

బుల్లెట్ నుంచి ప్రాణాలను కాపాడిన స్మార్ట్ఫోన్

Aug 3 2014 4:29 PM | Updated on Nov 6 2018 5:26 PM

బుల్లెట్ నుంచి ప్రాణాలను కాపాడిన స్మార్ట్ఫోన్ - Sakshi

బుల్లెట్ నుంచి ప్రాణాలను కాపాడిన స్మార్ట్ఫోన్

స్మార్ట్ఫోన్ సాంకేతిక, సమాచారం కోసమే కాదు బుల్లెట్ల నుంచి కూడా ప్రాణాలను కాపాడుతుంది

బీజింగ్: స్మార్ట్ఫోన్ సాంకేతిక, సమాచారం కోసమే కాదు బుల్లెట్ల నుంచి కూడా ప్రాణాలను కాపాడుతుంది. చైనాలో ఓ వింత సంఘటన జరిగింది. ఓ వ్యక్తికి సరుకుల సంచి దొరికింది. అయితే ఆ సంచి యజమానితో అతను జోక్ చేయడం ప్రాణాల మీదకు తెచ్చిపెట్టింది. సరుకుల సంచి ఆమ్మేసి బీరు కొనుకుంటానని సరదాగా అన్నాడు.

ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోని యజమాని కోపంతో తుపాకీ తీసుకుని కాల్చాడు. ఈ దెబ్బకు జోక్ చేసిన వ్యక్తికి పిట్టలా రాలిపోయేవాడు. అయితే అతని చొక్కా జేబులో ఉన్న శామ్సంగ్ గెలాక్సీ మెగా 6.3 స్మార్ట్ఫోన్ కాపాడింది. ఫోన్ బుల్లెట్ను అడ్డుకుంది. దీంతో అతను సురక్షితంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా ఫోన్ మాత్రం పాడైంది. ఏమైతేనేం స్మార్ట్ఫోన్ నిండు ప్రాణాన్ని కాపాడింది.

Advertisement
 
Advertisement
Advertisement