కాంతి కాలుష్యంతో నిద్రలేమి | Sleeplessness and Nighttime 'Light Pollution' | Sakshi
Sakshi News home page

కాంతి కాలుష్యంతో నిద్రలేమి

Mar 4 2016 1:22 AM | Updated on Sep 3 2017 6:55 PM

కాంతి కాలుష్యంతో నిద్రలేమి

కాంతి కాలుష్యంతో నిద్రలేమి

నేడు కాలుష్యం ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారింది. కాంతి కాలుష్యం వల్ల రాత్రి వేళల్లో లైట్ల ద్వారా చాలా మంది నిద్ర లేకుండా గడుపుతున్నారని...

న్యూయార్క్: నేడు కాలుష్యం ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారింది. కాంతి కాలుష్యం వల్ల రాత్రి వేళల్లో లైట్ల ద్వారా చాలా మంది నిద్ర లేకుండా గడుపుతున్నారని ఓ సర్వేలో తేలింది. దీని ప్రభావం మరుసటి రోజు పని మీద పడుతుందని తెలిసింది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలతో పోలిస్తే నగరాల్లో ఈ సమస్య మూడు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. కాలిఫోర్నియాకు చెందిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సీటీ బృందం 15,863 మందిపై 8 ఏళ్ల పాటు వారి నిద్ర అలవాట్లు, మానసిక స్థితి వంటి అంశాలపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో లైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

దీనివల్ల పగలు పనిలో త్వరగా అలసిపోవడంతో పాటు నిద్రమత్తులో ఉంటున్నారని వెల్లడి ంచారు. భద్రత కోసం వీధుల్లో ఏర్పాటు చేసిన పెద్ద లైట్ల వల్ల చాలా మందికి నిద్రలేమి వస్తోంది. కాంతి కాలుష్యం వల్ల భవిష్యత్తులో అనేక ప్రమాదాలు జరుగనున్నాయని స్టాన్‌ఫోర్‌‌డ యూనివ ర్సిటీ పరిశోధకుడు మారిస్ హయాన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement