మా డాడీ సిగ్నల్ జంప్ చేశాడు! | Six year old boy complain the Father as Signal Jump | Sakshi
Sakshi News home page

మా డాడీ సిగ్నల్ జంప్ చేశాడు!

Jun 3 2016 1:56 AM | Updated on Nov 6 2018 4:56 PM

మా డాడీ సిగ్నల్ జంప్ చేశాడు! - Sakshi

మా డాడీ సిగ్నల్ జంప్ చేశాడు!

అమెరికాలోని ఓ ఆరేళ్ల బాలుడు.. తన తండ్రి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాడంటూ పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

పోలీసులకు బుడతడి ఫిర్యాదు
బోస్టన్: అమెరికాలోని ఓ ఆరేళ్ల బాలుడు.. తన తండ్రి రోడ్డు నిబంధనలు ఉల్లంఘించాడంటూ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మసాచుసెట్స్‌లోని క్విన్సీకి చెందిన రాబర్ట్ రిచర్డ్సన్ తన తండ్రి  మైకేల్ రిచర్డ్సన్‌తో శనివారం కారులో వెళ్లినపుడు ఆయన రెడ్‌సిగ్నల్ జంప్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న రాబర్ట్ తన తండ్రి చట్టాన్ని అతిక్రమించాడని గట్టిగా అరిచాడు. కొన్ని సందర్భాల్లో రెడ్ పడినపుడు వెళ్లొచ్చని తండ్రి చెప్పినా అతడు పట్టించుకోలేదు. ఇంటికెళ్లాక 911కు ఫోన్ చేసి తన తండ్రి సిగ్నల్ జంప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదుచేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement