వీడెక్కడి ఖైదీరా బాబూ.. | Shots fired outside Orlando pizza shop | Sakshi
Sakshi News home page

వీడెక్కడి ఖైదీరా బాబూ..

May 29 2015 2:36 AM | Updated on Sep 3 2017 2:50 AM

వీడెక్కడి ఖైదీరా బాబూ..

వీడెక్కడి ఖైదీరా బాబూ..

పోలీసులను చూసి ఖైదీ భయపడటం సహజం. అయితే ఖైదీని చూసి పోలీసులే బెంబేలెత్తుతున్నారు.

చికాగో: పోలీసులను చూసి ఖైదీ భయపడటం సహజం. అయితే ఖైదీని చూసి పోలీసులే బెంబేలెత్తుతున్నారు. ఇంతకీ అసలు కథేమిటంటే.. పిజ్జా షాపుపై దాడి కేసులో చికాగోకు చెందిన 17 ఏళ్ల లామెంట్ క్యాథేని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. కారాగారంలోకి వచ్చాక మనోడి మానసికస్థితి దెబ్బతింది. దీంతో అన్నం తినడం మానేసి కనబడిన ప్రతీ లోహపు వస్తువునూ తినేయడం మొదలెట్టాడు.

చివరికి జైలులోని సెక్యూరిటీ కెమెరాలను కూడా వదల్లేదు. దీని వల్ల పలుమార్లు అనారోగ్యం పాలవడంతో క్యాథేని ఇప్పటివరకూ 24సార్లు ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్సలు చేయించారట. ఈ ఆపరేషన్లు, చికిత్సకు రూ.8 కోట్లకు పైనే ఖర్చయిందట. దీంతో వీడెక్కడి ఖైదీరా బాబూ అని జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement