నవాజ్‌ షరీఫ్‌కు షూ దెబ్బ! | Shoe hurled at former Pakistan PM Nawaz Sharif | Sakshi
Sakshi News home page

నవాజ్‌ షరీఫ్‌కు షూ దెబ్బ!

Mar 12 2018 3:22 AM | Updated on Mar 12 2018 2:50 PM

Shoe hurled at former Pakistan PM Nawaz Sharif - Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం జమియా నమీయా ఇస్లామిక్‌ విశ్వవిద్యాలయంలో ఓ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నవాజ్‌పై ఓ విద్యార్థి షూ విసిరాడు. ఆయన ప్రసంగించేందుకు మైక్‌ వద్దకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షూ నేరుగా నవాజ్‌ భుజాలు, చెవులకు బలంగా తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం నిందితుడితో పాటు అతని సహాయకుడ్ని భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement