రెండు విమానాలు ఢీకొంటే అంతే మరి! | Shocking pictures show the moment a plane's wing is sliced by another aircraft in a collision | Sakshi
Sakshi News home page

రెండు విమానాలు ఢీకొంటే అంతే మరి!

Jan 28 2016 10:57 AM | Updated on Sep 3 2017 4:29 PM

రెండు విమానాలు ఢీకొంటే అంతే మరి!

రెండు విమానాలు ఢీకొంటే అంతే మరి!

రెండు విమానాలు ఒక దానికి మరొకటి తాగిలితే ఎలా ఉంటుంది. ఇదే ఘటన షాంఘైలోని హంకియో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ రెండు విమానాలు కూడా చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానాలే.

చైనా: సాధారణంగా మనం కారు రివర్స్లో పెడుతున్నా.. లేదా బ్రేక్ ఆగక ముందు వెళ్లే వాహనానికి మెల్లగా తాటించిన గబాళ్లు మని శబ్దం రావడంతోపాటు రెండు వాహనాలకు భారీ సొట్టలు పడతాయి.. అలాంటిది రెండు విమానాలు ఒక దానికి మరొకటి తాగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇదే ఘటన షాంఘైలోని హంకియో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ రెండు విమానాలు కూడా చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానాలే.

ఒక విమానం తన ప్రయాణం ముగించుకుని సురక్షితంగా దిగి టర్మినల్ వద్దకు వస్తుండగా మరో విమానం ప్రయాణీకులను ఎక్కించుకుని బయలుదేరేందుకు రన్ వే వైపు కదిలేందుకు సిద్ధమై కదిలింది. ఇంతలో పెద్ద శబ్ధం.. చూస్తూండగానే వాటి రెక్కలు ఒకదానికి మరొకటి తగిలి అందులో ఓ విమానం రెక్క అమాంతం సగానికి పైగా చీలిపోయింది. ఏంజరుగుతుందా అని రెండు విమానాల్లో ప్రయాణీకులు అదిరిపడ్డారు. వెంటనే వాటిని పైలెట్లు ఆపేశారు. రెండు విమానాల్లోని ప్రయాణీకులను దించివేసి ఎయిర్ పోర్టుకు తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. కొంత ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందో విచారించేందుకు అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement