కుక్కల పోట్లాట.. మనుషుల తండ్లాట | shocking moment as dog viciously fight on Peru streets | Sakshi
Sakshi News home page

కుక్కల పోట్లాట.. మనుషుల తండ్లాట

Apr 22 2016 4:02 PM | Updated on Sep 29 2018 4:26 PM

కుక్కల పోట్లాట.. మనుషుల తండ్లాట - Sakshi

కుక్కల పోట్లాట.. మనుషుల తండ్లాట

కుక్కల్ని విడదీయటం ఎవ్వరివల్లా కాదు.. ఎప్పుడు? చిత్తకార్తెలో! మరి మామూలు కార్తెల్లో? అది కూడా ప్రేమతోకాకుండా పగతో పోట్లాడుకుంటుంటే?

కుక్కల్ని విడదీయటం ఎవ్వరివల్లా కాదు.. ఎప్పుడు? చిత్తకార్తెలో! మరి మామూలు కార్తెల్లో? అది కూడా ప్రేమతో కాకుండా పగతో పోట్లాడుకుంటుంటే? 'ఏముంది.. గట్టిగా 'ఛయ్' అని బెదిరించి, అంతకూ వినకుంటే రెండు రాళ్లు విసిరితే సరే' అంటారేమో. అవి ఇండియన్ కుక్కలో, ఇంకే దేశపు కుక్కలో అయితే వింటాయేమోగానీ పెరూవియన్ కుక్కల్ని విడదీయాలంటే మాత్రం చాలా కష్టం. ('ఇంతకీ అసలు కుక్కల్ని విడదీయాల్సిన అవసరం ఏముంది?' అనే మౌలికమైన ప్రశ్నకు వీడియోలో సమాధానం దొరుకుతుంది)

పెరూలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన చింబోటే నడివీధిలో రెండు కుక్కలు పోట్లాడుకున్నాయి. పెద్దకుక్క, చిన్నకుక్కను నోటకరిచి ప్రాణాలు తోడేసేందుకు ప్రయత్నించింది. అక్కడున్న మానవమాత్రులు ఆ హత్యాకాండను చూస్తూ ఎలా ఊరుకుంటారు? అందుకే రంగంలోకి దిగి కుక్కల్ని విడదీసే ప్రయత్నం చేశారు. ఒకాయన కర్రతో పెద్దకుక్కను ఎడాపెడా బాదాడు. ఇంకొకాయన బూటుకాలితో కిక్కులిచ్చాడు. మరొకాయన కుక్క కళ్లలో పెప్పర్ స్ప్రే చేశాడు. చల్లటి నీళ్లు పోస్తేనన్నా కుక్క కోపం తగ్గుతుందేమోనని నీళ్లుపోసిందొకామె.. ఇన్ని చేసినా ఈ పెద్ద శునకం పాపం చిన్నదాన్ని విడిచిపెట్టలేదు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో బాగా ట్రేడ్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement