తల తెంచి.. నోట్లో సిగరెట్‌ పీకలు

Shark Head Found at Marine Rescue Office in Australia - Sakshi

ఉదయాన్నే ఆఫీస్‌కు వచ్చిన వారికి గేటు దగ్గరే ఒళ్లు గగ్గురుపొడిచే దృశ్యం దర్శనమిచ్చింది. ఓ మూగ జీవిని అతి క్రూరంగా చంపి, దాని తలను గేటును వేలాడదీశారు. సోషల్‌ మీడియాలో ఆ ఫోటో వైరల్‌ కాగా, తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం, వైల్డ్‌ లైఫ్‌ విభాగాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టాయి.

సిడ్నీ:  సౌత్‌ సిడ్నీకి 100 కిలోమీటర్ల దూరంలోని షెల్‌ హార్బర్‌ మెరైన్‌ రెస్క్యూ ఆర్గనైజేషన్‌ కార్యాలయం. ఆదివారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బందికి భయానక దృశ్యం దర్శనమిచ్చింది. కార్యాలయం బయట ఉన్న ఫెన్సింగ్‌కు ఓ షార్క్‌ తల గుచ్చి ఉంది. దాని నోట్లో సిగరెట్‌ పీకలు.. సముద్రంలోని చెత్తను కుక్కారు. దిగ్భ్రాంతికి గురైన సిబ్బంది వెంటనే విషయాన్ని వైల్డ్‌ లైఫ్‌ అధికారులకు తెలియజేశారు. సుమారు 70 కేజీల బరువు ఉన్న ఆ జీవిని దుండగులు వేటాడి చంపి ఆపై దానిని తలను వేరు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు రక్తపు మరకల ఆధారంగా ఘటన జరిగి 24 గంటలు కూడా దాటి ఉండకపోవచ్చని, బహుశా శనివారం రాత్రిపూట దానిని వేటాడి ఉంటారని అంచనా వేస్తున్నారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా క్లూస్‌ సంపాదించే పనిలో అధికారులు ఉన్నారు.

జంతు ప్రేమికుల ఆవేదన.. కాగా, ఆ ఫోటోను ఆర్గనైజేషన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ‘మనిషి మృగంగా మారి మూగజీవాన్ని పొట్టనబెట్టుకున్నాడు’ అంటూ ఓ సందేశం ఉంచింది. నిందితులెవరైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని, జీవితంలో ఇలాంటి తప్పును మరోసారి చేయకుండా వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సరదా కోసం ఇలాంటి చేష్టలకు దిగుతున్న వారిని.. అదే స్థాయిలో దండిచాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ రాకాసి.. ప్లాస్టిక్‌ బ్రహ్మ రాక్షసి మూలంగా జల చర జీవులు మృత్యువాత పడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. తాజాగా ఓ తిమింగలం శవ పరీక్షలో భారీ ఎత్తున్న ప్లాసిక్ట్‌ సంచులు బయటపడ్డ ఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది.(పూర్తి కథనం)... నిన్నగాక మొన్న అరుదైన తాబేలు కడుపులోనూ భారీ ఎత్తున్న ఫ్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడ్డాయి. సముద్ర నీటిని కలుషితం చేయటం మూలంగా జీర్ణ వ్యవస్థ నాశనం అయి జలచరాలు మృత్యువాతపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top