
సీరియల్ కిల్లర్ శామ్యూల్ లిటిల్
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణమైన సీరియల్ కిల్లర్‌గా పేరుపడ్డ శామ్యూల్ లిటిల్(79)... హతమార్చిన వారి స్కోరు 50 పైనేనట. దర్యాప్తు అధికారుల ఎదుట చెప్పినదాని ప్రకారం శామ్యూల్ ఏకంగా 93 హత్యలకు పాల్పడ్డాడు. అయితే, అతడు చెప్పిన ఆధారాల ప్రకారం 50 హత్యల్లోనే అతడి ప్రమేయం ఉంది. హతుల్లో అత్యధికులు మహిళలే. ఇవన్నీ 1970–2005 మధ్య చేసినవే. కొందరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. మూడు హత్యలకు శిక్ష పడటంతో 2014లో శామ్యూల్ జైలు పాలయ్యాడు. ‘ఎప్పటికీ దొరకనని శామ్యూల్ అనుకునేవాడు. అన్ని హత్యల గురించీ దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎఫ్‌బీఐ అధికారి క్రిస్టీ పలాజొలో చెప్పారు. శామ్యూల్ ఒకప్పుడు బాక్సర్. 2012లో కెంటకీ పోలీసులకు అతడు దొరికిపోయాడు.