రిఫరెండంకు స్కాట్లాండ్‌ అంగీకారం | Scotland acceptance to referendum | Sakshi
Sakshi News home page

రిఫరెండంకు స్కాట్లాండ్‌ అంగీకారం

Mar 29 2017 3:29 AM | Updated on Sep 5 2017 7:20 AM

రిఫరెండంకు స్కాట్లాండ్‌ అంగీకారం

రిఫరెండంకు స్కాట్లాండ్‌ అంగీకారం

బ్రిటన్‌ నుంచి విడిపోయేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరాలని స్కాట్లాండ్‌ చట్ట సభ్యులు నిర్ణయించారు.

ఎడిన్‌బర్‌: బ్రిటన్‌ నుంచి విడిపోయేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరాలని స్కాట్లాండ్‌ చట్ట సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ఎడిన్‌బర్‌లో సమావేశమైన సభ్యులు రిఫరెండమ్‌కు అనుకూలంగా ఓటేశారు. అనుకూలంగా 69, వ్యతిరేకంగా  59 ఓట్లు పడ్డాయి. దీంతో స్కాట్లాండ్‌ స్వతంత్ర దేశంగా ఉండేదుకు ప్రజాభిప్రాయం నిర్వహించాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా కోరింది.

గతంలో ఒకసారి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించగా.. బ్రిటన్‌తో ఉండేందుకే స్కాట్లాండ్‌ వాసులు మొగ్గుచూపారు. అనంతరం ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న స్కాట్లాండ్‌ విడిపోయేందుకు సిద్ధమని ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement