సెల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరం కాదు! | Scientists allay fears about cell tower radiation | Sakshi
Sakshi News home page

సెల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరం కాదు!

Jun 24 2014 4:34 PM | Updated on Sep 2 2017 9:20 AM

సెల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరం కాదు!

సెల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరం కాదు!

నిపుణుల బృందం సెల్ టవర్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, సెల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రకటించింది.

సెల్ టవర్ నుంచి వెలువడే రేడియేషన్ ప్రమాదకరమా కాదా? ఇన్నాళ్లూ సెల్ టవర్ రేడియేషన్ ప్రమాదకరమేనని అనుకున్నాం. నిపుణులు అదే చెప్పారు. దాంతో సెల్ టవర్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. చాలా చోట్ల ఉన్న సెల్ టవర్లను పీకేశారు.
కానీ ఇప్పుడు ఒక నిపుణుల బృందం సెల్ టవర్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, సెల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రకటించింది. సెల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కూడా ప్రమాదకరం కాదని ఆ నిపుణులు అంటున్నారు.


ప్రముఖ రేడియాలజిస్టు డా భావిన్ జాంఖరియా సెల్ రేడియేషన్ క్యాన్సర్ వ్యాధికి కారణం కాదని చెప్పారు. దాని వల్ల మనుషులపై ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని ఆయన అన్నారు. ఆయన ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ కి అధ్యక్షులు కూడా. టాటా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కి చెందిన డా. హోసూర్ కాస్త టెంపరేచర్ ని పెంచడం తప్ప సెల్ రేడియేషన్ ఎలాంటి అపకారమూ చేయదని తేల్చి చెప్పారు. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సెల్ రేడియేషన్ క్యాన్సర్ కారకం కాదని ప్రకటించింది. కాబట్టి సెల్ టవర్ల విషయంలోనూ, ఫోన్ల విషయంలోనూ కంగారు పడాల్సిన అవసరం లేదని వారంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement