వైరల్‌: పిల్లోడిపై దూకేందుకు ప్రయత్నించిన పులి

Scary Video: My Son Was On Menu For Tiger - Sakshi

పులితో పరాచకాలొద్దు.. పులితో ఆట నాతో వేట మొదలెట్టొద్దు వంటి పాపులర్‌ పంచ్‌ డైలాగులు మీకు గుర్తుండే ఉంటాయి. కానీ ఇక్కడ పులికి ఎవరూ ఎదురెళ్లకపోయినా.. పులే నేరుగా వచ్చి పలకరించినంత పని చేసిందంటే నమ్మండి. ఐర్లాండ్‌లోని ఓ కుటుంబం సరదాగా జంతు ప్రదర్శనశాలకు వెళ్లింది. అక్కడ వారి కుమారిడిని ఫొటో దించడానికి వాళ్లు ప్రయత్నించారు. ఇంతలో ఓ పులి ఆ బుడ్డోడిని చూసి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని వైపుగా వస్తోంది. దీంతో పిల్లోడు వెనక్కి తిరిగి చూడగా పులి కనిపించింది.  అయినా అదేమీ పట్టనట్టు ఫొటోకు పోజిస్తుండగా ఆ పులి ఒక్క ఉదుటున బాలుడిని సమీపించి అతడిపై దాడి చేయబోయింది.

కానీ అక్కడ గాజుగ్లాస్‌ అడ్డుగా ఉండటంతో పులి దాన్ని దాటి లోనికి రాలేకపోయింది. ఈ భయంకర వీడియో చూసిన నెటిజన్లు బాలుడికి పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు. ‘అక్కడ ఆ గాజుగ్లాస్‌ లేకపోయుంటే నా కొడుకు జూలో పులికి ఆహారం అయ్యేవాడు’ అని బాలుడి తండ్రి పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను దాదాపు 2 మిలియన్ల మంది వీక్షించారు. బాలుడికి ఈ వీడియో తీపి గుర్తుగా మిగిలిపోతుందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ‘వేటాడటం అనే సహజ గుణాన్ని అణచివేసి పులిని జూలో బందీ చేశారు’ అని మరికొందరు ఆ జంతువు పట్ల జాలిని ప్రదర్శించారు. ఇక అదేజూలో మరో పులి కూడా అద్దానికి ఆనుకుని ఫొటో దిగుతున్న పిల్లలపైకి దూకేందుకు ప్రయత్నించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top