కలలు కల్లలయ్యాయి.. | Russian Model Collapsed During Catwalk, Dies in Hospital After Two Days in China | Sakshi
Sakshi News home page

బానిస కూలీ : క్యాట్‌వాక్‌ చేస్తూ కుప్పకూలిన మోడల్‌

Oct 28 2017 12:48 PM | Updated on Oct 28 2017 1:03 PM

Russian Model Collapsed During Catwalk, Dies in Hospital After Two Days in China

షాంఘై : కలల జీవితాన్ని అందుకునేందుకు రష్యా నుంచి చైనా వచ్చిన 14 ఏళ్ల మోడల్‌ కలలు కల్లలయ్యాయి. ఆశల జీవితం వాకిట క్యాట్‌ వాక్‌ చేస్తూ కుప్పకూలి ఆమె ప్రాణాలు విడిచింది. రష్యాకు చెందిన వాల్డా జ్యూబా ఓ ఏజెన్సీతో 'స్లేవ్‌ లేబర్‌'గా మూడు నెలల ఒప్పందం కుదర్చుకుని మోడలింగ్‌ కోసం చైనాకు వచ్చింది. ఈ ఒప్పందంలో మెడికల్‌ ఇన్సూరెన్స్‌ లేదు. 

చనిపోయే ముందు వాల్డా.. షాంఘైలో ఆసియన్‌ ఫ్యాషన్‌ షోలో పాల్గొంది. 13 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన షో కారణంగా ఆమె ఉద్వేగానికి గురైంది. అనంతరం తీవ్ర ఒత్తిడితో కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో కార్యక్రమ నిర్వహకులు వాల్డాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరకు ప్రాణాలు విడిచింది.

ఇది వాల్డా సమస్యే కాదు. రష్యా నుంచి చైనాకు మోడలింగ్‌కు వస్తున్న ఎందరో రష్యన్‌ యువతుల దీనగాథ. ఆశల జీవితం కోసం వస్తున్న మోడల్స్‌ ప్రాణాలతో చైనా ఏజెన్సీలు చెలగాటమాడుతున్నాయి. చిన్నవాటికి కూడా బాగా వేధిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement