27మంది రష్యా క్రీడాకారుల్లో మెల్డోనియం | Russian athletes test positive for meldonium | Sakshi
Sakshi News home page

27మంది రష్యా క్రీడాకారుల్లో మెల్డోనియం

Mar 25 2016 8:50 PM | Updated on Sep 3 2017 8:34 PM

ఈ ఏడాది తమ దేశ క్రీడాకారులకు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో 27మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైందని రష్యా క్రీడాశాఖమంత్రి విటలీ ముట్కో తెలిపారు.

మాస్కో: ఈ ఏడాది తమ దేశ క్రీడాకారులకు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో 27మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైందని రష్యా క్రీడాశాఖమంత్రి విటలీ ముట్కో తెలిపారు. వీరి శరీరాల్లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (డబ్ల్యూఏడీఏ) నిషేధించిన మెల్డోనియం నమునాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని తెలిపారు.

'ప్రపంచ వ్యాప్తంగా 127మంది ఇప్పటికీ మెల్డోనియం ఉపయోగిస్తున్నారని తేలగా వారిలో రష్యాకు చెందిన వారు 27 మంది ఉన్నారు. బహుషా.. ఈ సంఖ్య మారొచ్చు' అని ఆయన చెప్పారు. అయితే, వారి వివరాలు చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement