అది అంగీకార సంబంధం కాదు | Sakshi
Sakshi News home page

అది అంగీకార సంబంధం కాదు

Published Sun, Nov 4 2018 4:56 AM

Relationship based on coercion is not consensual - Sakshi

వాషింగ్టన్‌: విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌(67) అధికార దుర్వినియోగం, బలప్రయోగంతో తనపై అత్యాచారం చేశారని నేషనల్‌ పబ్లిక్‌ రేడియో చీఫ్‌ బిజినెస్‌ ఎడిటర్‌ పల్లవి గొగోయ్‌ స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరి మధ్య 1994లో కొన్ని నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగిందన్న అక్బర్‌ వాదనను ఆమె ఖండించారు. అక్బర్‌ చేతిలో తనకు ఎదురైన భయానక అనుభవాలపై పల్లవి వాషింగ్టన్‌ పోస్ట్‌కు ఓ కథానాన్ని రాశారు.

ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అక్బర్‌ లైంగిక వేధింపుల పర్వంపై వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికకు శుక్రవారం రాసిన వ్యాసంలోని ప్రతి అక్షరానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. అక్బర్‌ చేతిలో లైంగికదాడులకు గురైన మహిళలు ముందుకొచ్చి నిజాలను బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాతున్నట్లు వెల్లడించారు. తమను అక్బర్‌ లైంగికంగా వేధించాడని 16 మందికి పైగా మహిళలు ముందుకురావడంతో ఆయన్ను కేంద్రం మంత్రి బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement