‘ఫేస్‌బుక్‌’లో జాతి వివక్ష | Racial discrimination at Facebook | Sakshi
Sakshi News home page

‘ఫేస్‌బుక్‌’లో జాతి వివక్ష

Nov 29 2018 5:48 AM | Updated on Nov 29 2018 5:48 AM

Racial discrimination at Facebook - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థలో వ్యక్తుల రంగు ఆధారంగా వివక్ష చూపుతున్నారని మాజీ ఉద్యోగి ఒకరు బహిరంగ లేఖ రాశారు. నల్ల జాతీయుల్ని ఉద్యోగంలో నియమించుకునేందుకు, తమ నెట్‌వర్క్‌లో చేర్చుకునేందుకు ఫేస్‌బుక్‌ పెద్దగా ఆసక్తి చూపడం లేదని మార్క్‌ లూకీ అనే నల్లజాతీయుడు వెల్లడించారు. స్ట్రాటెజిక్‌ పార్ట్‌నర్‌ మేనేజర్‌గా ఆయన ఈ నెలలో రాజీనామా చేయడానికి ముందు ఈ లేఖను ఫేస్‌బుక్‌ ఉద్యోగులందరితో పంచుకున్నారు.

సోషల్‌ నెట్‌వర్క్‌లో నల్ల జాతీయులే ఎంతో క్రియాశీలకంగా ఉంటున్నారని, సమాచార గోప్యతకు వారు చేస్తున్న ప్రయత్నాల్ని ఫేస్‌బుక్‌ పట్టించుకోవడం లేదని తెలిపారు. నల్ల జాతీయేతరుల మాటే చెల్లుబాటవుతోందని, వారు చెబితే విద్వేషపూరిత సమాచారం కాకున్నా ఆ ఖాతాలను నిలిపేస్తున్నారని ఆరోపించారు. అసలు నల్ల జాతీయులు తమ సంస్థలో పనిచేస్తున్న సంగతినే చాలా మంది ఉద్యోగులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లూకీకి ఎదురైన అనుభవాలు అందరికీ వర్తించవని స్మిత్‌ అనే ఉద్యోగి పేర్కొన్నారు. లూకీ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఫేస్‌బుక్‌  నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement