భారత్‌ మళ్లీ దాడి చేయాలని చూస్తోంది

Qureshi claims India planning another attack against Pakistan - Sakshi

పాక్‌ విదేశాంగ మంత్రి ఆరోపణ

ఇస్లామాబాద్‌: ఏప్రిల్‌ 16 నుంచి 20వ తేదీల మధ్య పాక్‌పై దాడి చేసేందుకు భారత్‌ ప్రయత్నాలు చేస్తోందంటూ నిఘా వర్గాల సమాచారం అందిందని పాక్‌ విదేశాంగ మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 26వ తేదీన పాక్‌ భూభాగంలోని బాలాకోట్‌పై భారత్‌ జరిపిన బాంబు దాడిపై అంతర్జాతీయ సమాజం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. పాక్‌ మంత్రి ప్రకటనను భారత్‌ ఖండించింది. ఈ ప్రాంతంలో యుద్ధభయాన్ని పెంచడమే పాక్‌ ఉద్దేశమని భారత విదేశాంగ శాఖ  తెలిపింది. ‘పాక్‌ మంత్రి చేసిన బాధ్యతారహిత, అవమానకర ప్రకటన. యుద్ధభయాన్ని పెంచడమే పాక్‌ ఉద్దేశం. భారత్‌లో ఉగ్రదాడులకు పాల్పడాలంటూ అక్కడి ఉగ్ర సంస్థలకు పిలుపునిచ్చేందుకే ఇలాంటి ఎత్తులు వేస్తోంది’ అని భారత్‌ ప్రకటించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top