అసహజ పద్ధతిలో శృంగారం కోరి... | Psychologist dies after 'asking roommate to strangle her during | Sakshi
Sakshi News home page

అసహజ పద్ధతిలో శృంగారం కోరి...

May 19 2016 5:25 PM | Updated on Sep 4 2017 12:27 AM

అసహజ పద్ధతిలో శృంగారం కోరి...

అసహజ పద్ధతిలో శృంగారం కోరి...

ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్తో ఏకాంతంగా గడుపుతూ ప్రాణాలు కోల్పోయింది.

మెక్సికో: ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్తో ఏకాంతంగా గడుపుతూ ప్రాణాలు కోల్పోయింది. అసహజ పద్ధతిలో ఆమె శృంగారాన్ని కోరుకుని ఆ క్రమంలో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు విస్తుపోయే విషయాలు చెప్పాడు. ఆమెకు వాయిలెంట్ సెక్స్ అంటే ఇష్టమని ఆ క్రమంలోనే చనిపోయిందని వెల్లడించాడు. అతడు చెప్పిన ప్రకారం... మెక్సికోలో టానియా ట్రినిడాడ్ పారెడెస్ (23) అనే యువతి సైకాలజిస్ట్‌గా పనిచేస్తుంది. ఆమెకు జువాన్ రుయిజ్ టార్రెస్(32) అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.

ఆమె అతడు మరో వ్యక్తితో కలిసి తన అపార్ట్ మెంట్లో మద్యం సేవించారు. ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నారు. అలా పాల్గొనే క్రమంలో ఆమె రెండో వ్యక్తితో కూడా అసహజ పద్ధతిలో శృంగారానికి ఒత్తిడి చేసింది. అంతేకాదు ఓ కేబుల్ వైర్ తో తనను కొడుతూ ఉండాలని కోరిందని ఆ క్రమంలో అనూహ్యంగా కుప్పకూలి చనిపోయిందని చెప్పాడు. శవపరీక్ష నివేదికలో కూడా అతడు చెప్పిన విషయాలను బలపరిచే విధంగా ఉంది. ఊపిరి స్తంభించిపోయి ఆమె మృతి చెందిందని తెలిపింది. దీంతో పోలీసులు ప్రస్తుతానికి అతడిని అరెస్టు చేయకుండా మరో కోణంలో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement